తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త ఇన్నింగ్స్.. ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
 
                            Mohammad Azharuddin
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
అజారుద్దీన్ ప్రస్తానం
- హైదరాబాద్‌లో 1963, ఫిబ్రవరి 8న జన్మించిన అజారుద్దీన్
- అబిడ్స్ ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో చదువు
- నిజాం కాలేజీలో బీకాం
- 1984లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం
- 1989లో టీమిఒండియా కెప్టెన్
- 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో
- మొత్తం 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్
- క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి..
- 2009లో కాంగ్రెస్ పార్టీలోకి
- ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఎంపీగా గెలుపు
- 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
- 2025లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.






