KTR: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్‌

తాను దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

KTR: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్‌

Updated On : January 7, 2025 / 7:36 PM IST

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇప్పటికే తెలంగాణ సర్కారు కూడా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని కోరింది. కేటీఆర్ తరఫున పిటిషన్ దాఖలైన సమయంలో మధ్యంతర ఉత్తర్వులు లేదంటూ స్టే ఇచ్చే ముందు సర్కారు వాదనలు వినడం తప్పనిసరి అవుతుంది.

కాగా, ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని రోజులుగా దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, చివరకు హైకోర్టు కేటీఆర్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

కేటీఆర్ అరెస్టయితే అది కక్ష పూరితంగా చేసిన అరెస్ట్ కానేకాదు.. తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే: మంత్రి పొంగులేటి