Santosh Kumar : బీఆర్ఎస్ ను వీడనున్న మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్.. తిరిగి కాంగ్రెస్ గూటికి?
పార్టీ ఫిరాయించినప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సంతోష్ కుమార్ మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.

Santosh Kumar
Former MLC Santosh Kumar : బీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. టికెట్ ఆశించి భంగపడిన నేతలు, అసంతృప్తులు బీఆర్ఎస్ కు గుడ్ బై బెబుతున్నారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడగా, మరికొంతమంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ లో చేరిన మరికొంతమంది అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారు.
సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన సంతోష్ కుమార్ 2019లో బీఆఎస్ లో చేరారు. కాంగ్రెస్ ను మండలిలో టీఆర్ఎస్ లో విలీనం చేయడంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు వెంట సంతోష్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లో విలీనం చేశారు.
Chennamaneni Ramesh: బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని కీలక ప్రకటన
అయితే, పార్టీ ఫిరాయించినప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సంతోష్ కుమార్ మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. సంతోష్ కుమార్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.