Formula E Car Race Case: ఈ కార్ రేస్ కేసు.. వెలుగులోకి కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్..

ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు.

Formula E Car Race Case: ఈ కార్ రేస్ కేసు.. వెలుగులోకి కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్..

Updated On : November 22, 2025 / 6:11 PM IST

Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాస్యికూషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ ను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి అందించింది. తాజాగా ఏసీబీ ఫైనల్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఫైనల్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఏసీబీ. ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ పైన ఏసీబీ పలు అభియోగాలు మోపింది.

కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారని, అక్రమ పద్ధతుల్లో అనుమతులు ఇచ్చారని ఏసీబీ పేర్కొంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాభం పొందారని, రాజకీయ లబ్ది కోసం వినియోగించుకున్నారని ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. అలాగే ఏ4గా, ఏ5గా ఎఫ్ఈవో ప్రతినిధులను చేర్చారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేస్ నిర్వహించారని రిపోర్టులో పేర్కొన్నారు.

క్విడ్ ప్రో కో జరిగిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని రిపోర్టులో ప్రస్తావించారు. ఇక ట్రై పార్టీ అగ్రిమెంట్ కి ముందే ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు గుర్తించామన్నారు ఏసీబీ అధికారులు. రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్ట్ లను కాంపిటిటీవ్ అథారిటీ అనుమతి లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ చేశారని ఏసీబీ రిపోర్టులో అధికారులు రాసుకొచ్చారు. రెండు అగ్రిమెంట్లు గవర్నర్ నోటీసులో లేవని తేల్చారు.

హెచ్ఎండీఏ ప్రమోటర్ గా ఉండేందుకు హెచ్ఎండీఏ నిధులను ఉపయోగిచారని ఏసీబీ అధికారులు రిపోర్టులో ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు ఏసీబీ అధికారులు. అప్పటి సీఎస్, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. 10 కోట్ల కంటే అధిక నిధులు చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, రూల్ ను అతిక్రమించారని ఏసీబీ అధికారులు అంటున్నారు.

Also Read: లొంగిపోయిన 37మంది మావోయిస్టులు.. డీజీపీ కీలక వ్యాఖ్యలు..