Formula E: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు.. కేటీఆర్ ఆగ్రహం

ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అంటూ ఆయన..

Formula E: హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దు.. కేటీఆర్ ఆగ్రహం

ktr

Updated On : January 6, 2024 / 12:21 PM IST

హైదరాబాద్‌లో వచ్చేనెల 10న జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దయింది. ఈ విషయాన్ని FIA ఫార్ములా-ఈ వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు చెప్పారు.

ఫార్ములా ఈ రేస్ రద్దుపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడుతూ ట్వీట్ చేశారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇటువంటి ఈవెంట్‌లు నిర్వహిస్తే ప్రపంచ వ్యాప్తంగా మన నగర, దేశ బ్రాండ్ ఇమేజ్‌ పెరుగుతుందని చెప్పారు.

హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూపడానికి ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ను కొన్ని నెలల క్రితం చక్కగా వాడుకుందని చెప్పారు.

ఇప్పుడు ఈ ఈవెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని అన్నారు. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.