family suicide : ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం.. ఇటీవలే కూతురికి వివాహం
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Four Committed Suicide In The Same Family At Manchiryala
Four committed suicide in the same family : మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాసిపేట మండలం మల్కపల్లిలో ఉరి వేసుకొని కుమారుడు, కుమార్తెతో పాటు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
రమేశ్, పద్మ దంపతులు ఓ గదిలో… కుమారుడు అక్షయ్, కుమార్తె సౌమ్య మరో గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవలే సౌమ్యకు వివాహమైందని… రెండ్రోజుల క్రితం అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిందని బంధువులు చెప్తున్నారు.
నలుగురి ఆత్మహత్యకు అప్పులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. వీరి మృతితో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.