Road Accident : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident (3)
Hanmakonda Road Accident : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురురెదురుగా వస్తున్న కారు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏటునాగారం నుంచి వేములవాడకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వేములవాడ వెళ్తున్నారు. మార్గంమధ్యలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో కారును ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మంతెన కాంతయ్య (72 ), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29 ), మంతెన వందన (16) నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఆదిలాబాద్ రిమ్స్ విద్యార్థులు మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు పోలీసులు తరలించారు. తీవ్రంగా గాయపడిన మంతెన రేణుక (60), మంతెన భార్గవ్ (30), మంతెన శ్రీదేవి (50) ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఏటూరునాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.