Road Accident Four Killed : ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident Four Killed : ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురు మృతి

road accident

Updated On : January 21, 2023 / 7:06 AM IST

Road Accident Four Killed : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇల్లందు నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో కోటి లింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం ఇల్లందు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే రణధీర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతులు నలుగురు హన్మకొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Road Accident Three Died : వివాహానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ ను ఢీకొని ముగ్గురు మృతి

కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కళ్యాణ్, శివగా గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మోతేకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.