Ganesh Immersion : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం.. ట్యాంక్ బంద్ వద్ద వందలాది విగ్రహాలు క్యూ

ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు.

Ganesh Immersion : హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం.. ట్యాంక్ బంద్ వద్ద వందలాది విగ్రహాలు క్యూ

Ganesh immersion in Hyderabad

Ganesh immersion In Hyderabad : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. గణ నాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమం ఇంకా నడుస్తోంది. వీధి వీధి నుంచి వచ్చిన గణ నాథులు హుస్సేన్ సాగర్ వద్ద బారులు తీరాయి. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైవోవర్ తోపాటు హుస్సేన్ సాగర్, చుట్టు పక్కల ప్రాంతాల్లో నిమజ్జనం కోసం ఇంకా చాలా విగ్రహాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికీ వందలాది విగ్రహాలు ఇంకా క్యూలో ఉన్నాయి. మరోవైపు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు అర్ధరాత్రి జనంతో కిక్కిరిసి పోయాయి.

ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. నిన్న మధ్యాహ్నం నుంచే సండడి మొదలైంది. బడా గణేషుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనమే పూర్తైంది. భారీ గణేషుడిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. డీజే సౌండ్ కు హుషారుగా డ్యాన్స్ చేస్తూ గణేష్ శోభయాత్ర కొనసాగించారు. మొత్తం 40 వేల మంది పోలీసులు నిమజ్జనానికి బందోబస్తు కల్పించారు. 20వేలకు పైగా సీసీ కెమెరాలతో నగరం మొత్తం నిఘా పెట్టారు.

Tirumala : నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ.. మాడ వీధులలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు

రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. ఆర్పీఎఫ్, రైల్వే ఫోర్స్ సేవలను కూడా వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తైన తర్వాత ఇక చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలివచ్చాయి. ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ శోభాయమానంగా ఆధ్యాత్మికతో అలరారాయి. అనేక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

వర్షం చినుకులు పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా ఆ వినాయకుడి వెంట వీడ్కోలు పలికేందుకు డ్యాన్సులు, డీజే స్టెప్పులతో భక్తులంతా హోరెత్తించారు. ముఖ్యంగా యువత సందడి అయితే చెప్పనలవి కాదు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చిన్న చిన్న గణ నాథుడు మొదలుకొని మధ్యస్తగా ఉన్న వినాయకుళ్లను కూడా అక్కడ నిమజ్జనం చేశారు.