వామ్మో.. వేలంపాటలో రూ.1.87 కోట్లు పలికిన గణపతి లడ్డూ.. ఎక్కడో తెలుసా..

గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది లడ్డూ ధర 67 లక్షలకు వేలం పాటలో భక్తులు దక్కించుకున్నారు.

వామ్మో.. వేలంపాటలో రూ.1.87 కోట్లు పలికిన గణపతి లడ్డూ.. ఎక్కడో తెలుసా..

Updated On : September 17, 2024 / 8:24 PM IST

Ganesh Laddu Record Price : గణేశ్ ఉత్సవాల ముగింపులో జరిగే లడ్డూ ప్రసాద వేలం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంటోంది. ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది రికార్డులు బ్రేక్ అవుతాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ.. సంచలనం నమోదైంది. ఓ వినాయకుడి లడ్డూ.. వేలం పాటలో ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయలు పలికింది. లడ్డూ వేలం పాట అంటే వెంటనే గుర్తొచ్చేది బాలాపూర్ గణేశ్ లడ్డూనే. కానీ, ఇప్పుడు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.

Also Read : బాలాపూర్ లడ్డూకు వేలంలో రికార్డు ధర.. ఎవరు దక్కించుకున్నారంటే?

ఈసారి ఏకంగా ఓ గణపయ్య లడ్డూ ప్రసాదం ఏకంగా కోటి 87 లక్షల రూపాయల ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఈ రికార్డ్ నమోదైంది. దీంతో గణేశుడి లడ్డూ ధర రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది లడ్డూ ధర 67 లక్షలకు వేలం పాటలో భక్తులు దక్కించుకున్నారు.

”వేలం పాటలో లడ్డూ ధర ఈసారి కోటి 87 లక్షలు పలికింది. మెంబర్ అంతా నాలుగు గ్రూపులుగా ఏర్పడతాం. ఒక్కో గ్రూపు నుంచి వేలంపాటలో పాల్గొంటాం. మా టీమ్ లో ఓవరాల్ గా కలెక్ట్ అయిన అమౌంట్ ఒక కోటి 87 లక్షలు. ఈ మొత్తం అమౌంట్ ను మేము సేవా కార్యక్రమాలకే వాడతాము. అనాధ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, పేద పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులు కట్టడానికి వాడతాం. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వారికి సాయం చేస్తాం. కొన్ని సంస్థల్లో వారికి అవసరమైన ప్రత్యేక ఎక్విప్ మెంట్ కొనేందుకు ఆర్థిక సాయం చేస్తాం” అని వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న గ్రూపులోని ఒక మెంబర్ తెలిపారు.