Gangula Kamalakar: బీఆర్ఎస్ నుంచి ఒక్కరు పార్టీ మారితే.. కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి..: గంగుల
Gangula Kamalakar: ప్రజలకు నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలన గురించి అర్థమైందని గంగుల కమలాకర్ చెప్పారు.

Gangula Kamalakar
తెలంగాణకు సీఎంగా కేసీఆర్ లేకపోవడంతో ఈ నెల రోజులు ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబంధు, రుణమాఫీ ఇప్పటికీ రాలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.
అందుకే తాము గుర్తు చేస్తున్నామని గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు. తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామని, తాము గేట్లు తెరిస్తే చాలా మంది తమ పార్టీలోకి వస్తారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరు పార్టీ మారితే.. కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని అన్నారు. ప్రజలకు నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలన గురించి అర్థమైందని చెప్పారు.
బీఆర్ఎస్‌పై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని గంగుల కమలాకర్ అన్నారు. ఎంపీగా వినోద్ కుమార్‌ను గెలిపించుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ పరిధిలోని ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే తాము ఆధిక్యతతో ఉన్నామని చెప్పుకొచ్చారు. వినోద్ కుమార్‌ను గెలిపించుకుంటామని అన్నారు.
కరీంనగర్ ఎంపీ స్థానంలో ట్రయాంగిల్ ఫైట్.. కాంగ్రెస్‌కు అదే పెద్ద మైనస్