తాగునీరు, కరెంట్ ఉచితం.. గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్

ghmc elections trs manifesto: తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేశారు. సోమవారం(నవంబర్ 23,2020) మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేశారు. గ్రేటర్ ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోని రూపొందించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. మేనిఫెస్టోలో గ్రేటర్ వాసులకు భారీగా తాయిలాలు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా చేస్తామన్నారు. డిసెంబర్ నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు డిసెంబర్ నుంచి సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
* గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్
* మన నగరం – మన పార్టీ – మన పాలన పేరుతో మేనిఫెస్టో రూపకల్పన
* గ్రేటర్ ప్రజలను ఆకట్టుకునేలా టీఆర్ఎస్ మేనిఫెస్టో
* హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఫోకస్
కేసీఆర్ కామెంట్స్:
* రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి
* దేశంలోనే కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది
* హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు
* నూతన డ్రైనేజీ వ్యవస్థను జనవరిలో తెచ్చే కొత్త నాలా చట్టానికి ప్రాధాన్యం
* త్వరలోనే జీహెచ్ఎంసీ కొత్త చట్టం, అవినీతిరహితంగా కొత్త చట్టం
* జీహెచ్ఎంసీ పరధిలో సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్ లకు ఉచిత విద్యుత్
* 5 నెలల తర్వాత మిగిలిన మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ అమలు
* 20వేల లీటర్ల వరకు పూర్తి ఉచితంగా మంచినీళ్లు
* డిసెంబర్ నుంచి హైదరాబాద్ నగర ప్రజలు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు
* నెలకు 20వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు కట్టనవసరం లేదు
* పేదలకు తాగునీటి చార్జీలు భారం కావొద్దని నిర్ణయం
* టీఎస్ బీపాస్ ను పటిష్టంగా అమలు చేస్తాం
* కరోనా కాలం నుంచి రూ.267 కోట్ల మోటార్ వాహన పన్నులు రద్దు
* 2020 మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మోటార్ వాహన పన్ను మాఫీ
* రూ.10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్ మెంట్ సాయం
* రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు
* రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచుకునేందుకు అనుమతి
* సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు సవరించుకునేందుకు వెసులుబాటు
* తాగునీటి అవసరాలకు త్వరలోనే కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మాణం
* 20వేల లీటర్లకుపైగా నల్లా నీరు వాడేవారికి కొంత చార్జీ వేస్తాం
* ఉచిత నీటి పథకం ఢిల్లీ తర్వాత దేశంలో హైదరాబాద్ రెండోది
* రూ.13వేల కోట్ల వ్యయ అంచనాతో సమగ్ర సీనరేజ్ మాస్టర్ ప్లాన్
* బీహెచ్ఈఎల్-మెహిదీపట్నం మెట్రో రైల్ విస్తరణ
* రాయదుర్గం ఎయిర్ పోర్టు వరకు మెట్రో
* శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఎక్స్ ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్ట్
* ఎస్ఆర్డీపీ 2,3 దశల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీ రోడ్లు
* గమ్యానికి త్వరగా చేరుకునేలా 125 లింక్ రోడ్ల ప్రతిపాదన
* హైదరాబాద్ ను జీరో కార్బన్ సిటీగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులు
* నగరం నలువైపుల బస్తీ దవాఖానాలు, మరో మూడు టిమ్స్ ఏర్పాటు
* జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా రవాణాకు పెద్దపీట
* ఈ హయాంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేస్తాం
* ఎయిర్ పోర్టుకు వేగంగా వెళ్లేందుకు ఎక్స్ ప్రెస్ మెట్రో రైల్ ప్రాజెక్ట్
* మరో 90 కిమీ ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం
* వరద నీటి నిర్వహణకు మాస్టర్ ప్లాన్
* 30 నుంచి 40 సెంమీ వర్షపాతం తట్టుకునేలా నాలాలు ఏర్పాటు
* మాస్టర్ ప్లాన్ ను త్వరలోనే పట్టాలు ఎక్కిస్తాం
* మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.12వేల కోట్లు అవుతుందని అంచనా