దానం నాగేంద‌ర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ.. కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరికకు..

దానం నాగేంద‌ర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భేటీ.. కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ!

GHMC Mayor Gadwal Vijayalakshmi

GHMC Mayor Gadwal Vijayalakshmi : ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైందన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాసు మున్సీ మేయర్ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల విజయక్ష్మీని ఆహ్వానించారు. దీంతో విజయలక్ష్మీ పార్టీ మారుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ తో ఆమె సమావేశం కావటం హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీనియర్ నేత వీహెచ్ భేటీ

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు కుమార్తె. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఆమె విజయం సాధించారు. 2021లోనూ రెండోసారి గెలిచి మేయర్ అయ్యారు. అయితే, ఆమె బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈనెల 22న ఆమె నివాసంకు కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డిలు వెళ్లి సమావేశం అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని విజయలక్ష్మీని ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతానని విజయలక్ష్మీ పేర్కొన్నట్లు తెలిసింది.

Also Read : Mahabubabad MP : బీఆర్ఎస్, బీజేపీకి సవాల్‌గా మారిన గెలుపు.. మహబూబాబాద్‌లో రసవత్తర రాజకీయం

గద్వాల విజయలక్ష్మీ దాదాపు పది మంది కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ తో ఆమె భేటీ కావటం హాట్ టాపిక్ గా మారింది.  వియలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఈ క్రమంలోనే దానంతో భేటీ అయ్యారని తెలుస్తోంది. అయితే, ఆమె దానం నాగేందర్ ను ఎందుకు కలిశారు? మర్యాదపూర్వకంగా కలిశారా? కాంగ్రెస్ పార్టీలో చేరిక తేదీపై చర్చించేందుకు కలిశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.