Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.80వేలకు చేరిన కిలో వెండి ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు గురువారంతో పోలిస్తే 10గ్రాములపై రూ. 200 పెరిగింది. శుక్రవారం ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో ఉదయం నమోదైన ధరల వివరాలను పరిశీలిస్తే..

Gold Price
Gold and Silver Prices Today: బంగారం కొనుగోలుదారులకు ధరలు షాకిస్తున్నాయి. గత మూడు రోజులుగా వరుసగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల సామాన్యులకు ఇబ్బందికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర రూ. 60వేల మార్కుకు చేరువలో ఉంది. కిలో వెండి ధర రూ. 80వేలకు చేరింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు గురువారంతో పోలిస్తే 10గ్రాములపై రూ. 200 పెరిగింది. శుక్రవారం ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంలలో ఉదయం నమోదైన ధరల వివరాలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది. కిలో వెండి మరోసారి రూ. 1500 పెరిగింది. దీంతో శుక్రవారం కిలో వెండి రూ. 80వేల మార్క్‌కు చేరింది.

gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,650కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,600గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,830 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 59,820 మార్క్ వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59, 450గా ఉంది. బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900, ముంబైలో రూ. 76,900, చెన్నై, బెంగళూరులో రూ. 75,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో రూ. 80,000 మార్క్‌కు చేరుకుంది.