Gone Prakash Rao: బండి సంజయ్‌‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా.. వాళ్లిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు

కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక, మట్టి, గ్రానైట్ తరలింపులు జరుగుతున్నాయని, అయినా చర్యలు లేవని గోనెల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gone Prakash Rao: బండి సంజయ్‌‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా.. వాళ్లిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు

Gone Prakash Rao

Updated On : May 24, 2023 / 1:45 PM IST

MP Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ ఒక్కటేనని, వ్యాపారస్తుల నుంచి స్వయంగా పోలీసు వాళ్లతో నిధులు వసూళ్లు చేయించారని ఆరోపించారు. గతేడాది కరీంనగర్ కళోత్సవాల పేరుతో ప్రైవేటు వ్యక్తుల వద్ద నుండి కోట్ల రూపాయలు వసూలుచేసి ఖర్చుచేసిన లెక్కలు తేల్చలేదని, మంత్రి గంగుల కమలాకర్ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని గోనె అన్నారు.

Gone Prakash Rao: తెలంగాణ ప్రభుత్వంపై గోనె ప్రకాశరావు ఫైర్.. పట్టించుకోవడం లేదని..

మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు, అన్ని అక్రమాల్లో ఇద్దరికి వాటా ఉందని ప్రకాష్ రావు ఆరోపించారు. బండి సంజయ్‌పై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తా, గంగుల కమలాకర్‌పై ముఖ్యమంత్రి సమయమిస్తే వివరాలు తెలియజేస్తానని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో కోట్లాది రూపాయల కమిషన్లు చేతులు మారుతున్నాయని గోనె ఆరోపించారు.

Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక, మట్టి, గ్రానైట్ తరలింపులు జరుగుతున్నాయని, అయినా చర్యలు లేవని గోనెల ఆగ్రహం వ్యక్తం చేశారు. నా అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని, ఖచ్చితంగా వాటిని బయటపెడతానని చెప్పారు.