గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు అందేది ఎప్పుడంటే? మంత్రి తుమ్మల ప్రకటన

తెలంగాణ అంతా పామాయిల్ సాగు చేస్తే రైతుకి ఆదాయం వస్తుందని చెప్పారు.

గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా డబ్బులు అందేది ఎప్పుడంటే? మంత్రి తుమ్మల ప్రకటన

Minister Tummala Nageswara Rao

Updated On : June 13, 2025 / 3:07 PM IST

రైతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెల 25లోపు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. భూ కమతాల ప్రకారం రైతు భరోసా ఇస్తామని అన్నారు. పది ఎకరాలు లోపు వెసులుబాటు వస్తే రైతు భరోసా ఇస్తామని తెలిపారు. రైతు కూలీలకి కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు.

ఇవాళ తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎరువులు కొరత లేకుండా చూస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడానని, లేఖ రాశానని తెలిపారు. యూరియా ఎక్కువగా వాడకూడదని, నేచురల్ ఫామింగ్ తోనే వ్యవసాయం చేయాలన్నారు.

Also Read: గుజరాత్ మాజీ సీఎం మృతికి.. ఆయన అదృష్ట సంఖ్యతో సంబంధం ఏమిటి..? సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..

తమ తండ్రి హయాంలో పురుగుల మందులు కొట్టలేదని, ఇప్పుడు పురుగుల మందులు వాడకం పెరిగిందని చెప్పారు. యూరియా మీద లక్షా 70 వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ పెడతామని చెప్పారు. పామాయిల్ కి ఎంజీపీ పాలసీ త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.

త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2.50 లక్షల ఎకరాలు పామాయిల్ సాగు అవుతుందని అన్నారు. తెలంగాణ అంతా పామాయిల్ సాగు చేస్తే రైతుకి ఆదాయం వస్తుందని చెప్పారు. ఆరు రకాల వంగడాలను ఈ ఏడాది ఇతర దేశాలు కొనుగోలు చేశాయని చెప్పారు.