Kingfisher Beer : తెలంగాణలో మందుబాబులకు శుభవార్త.. ఏంటో తెలుసా..
తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ ఇచ్చిన హామీ మేరకు, అలాగే ఉద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సప్లయ్ ని కొనసాగిస్తామని లేఖను విడుదల చేసింది..

Kingfisher Beer : తెలంగాణలో మందుబాబులకు శుభవార్త అందింది. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాకు యూబీ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బేవరేజ్ కార్పొరేషన్ హామీతో బీర్ల సరఫరా పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. దీంతో యూబీ సంస్థ బీర్ల సరఫరా పునరుద్దరణ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల ప్రియులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. గత వారం కింగ్ ఫిషర్ కంపెనీ బకాయిలు చెల్లించడంతో పాటు బీర్ల ధరలు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు రాసింది. ధరల పెంపుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో తాము బీర్ల సప్లయ్ ని నిలిపివేస్తామని గత వారం ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఇక దొరకవు అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి, కంపెనీకి కొంత సంప్రదింపులు జరిగాయి.
Also Read : నల్గొండ కాంగ్రెస్ లో కొత్త, పాతల పంచాయితీ.. రెండుగా చీలిన నకిరేకల్ నియోజకవర్గ క్యాడర్!
తాజాగా తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ హామీ ఇచ్చిన మేరకు.. కింగ్ ఫిషర్ బీర్లను మళ్లీ సప్లయ్ చేసేందుకు యూబీ సంస్థ సిద్ధమైంది. దీనికి సంబంధించి యూబీ సంస్థ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ ఇచ్చిన హామీ మేరకు, అలాగే ఉద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీర్ల సప్లయ్ ని కొనసాగిస్తామని లేఖను విడుదల చేసింది కింగ్ ఫిషర్ కంపెనీ. ఈ నేపథ్యంలో తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సప్లయ్ బంద్ అవుతుందన్న ప్రచారానికి తెరపడిందని చెప్పొచ్చు. కింగ్ ఫిషర్ బీర్ ప్రియులకు ఇది శుభవార్తగా చెప్పాలి.