రైతులకు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఇంకా ఎక్కువ లోన్లు ఇస్తారు.. ఏయే పంటలకు ఎంత ఇస్తారంటే..
టెస్కాబ్ ఖరారు చేసిన రుణ పరిమితికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.

Farmers
Increase Loan Limit: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 వార్షిక రుణ పరిమితిని ఖరారు చేసింది. రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ) ప్రతిపాదనల మేరకు రుణపరిమితికి టెస్కాబ్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి, బ్యాంకులకు, అన్ని జిల్లాలకు పంపించింది.
Also Read: Telangana Govt: శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. ఇకనుంచి వారి కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం
టెస్కాబ్ ఖరారు చేసిన రుణ పరిమితికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ – 2025-26 ప్రకారం రైతులకు రుణ పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచీ బ్యాంకులకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తంగా గతేడాది కంటే ఈసారి రైతులు సాగుచేసే పంటలకు రుణ పరిమితిలో పెరుగుదల చోటు చేసుకుంది. వరి, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు.. చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజల సాగుతోపాటు.. ఉద్యాన పంటలు మొత్తంగా 122 రకాలైన పంటలతోపాటు పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, పందులు, తేనె టీగలు పెంపకానికి కూడా రుణ పరిమితిని టెస్కాబ్ పెంచింది.
2025-26 వానాకాలం, యాసంగిలో పంటలకు పెంచిన రుణ పరిమితి అమలవుతుంది. వరి పంటకు ఎకరానికి రూ. వెయ్యి పెంచగా.. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటల సాగుకు రూ.2వేలు చొప్పున పెంచారు. సజ్జ, కంది, మినుములకు రూ. వెయ్యి చొప్పున, పామాయిల్ పంట సాగుకు రూ.4వేలు పెంచారు. మొత్తంగా గతఏడాది పత్తి పంటకు రూ. 46వేలు రుణ పరిమితి నిర్ధారించగా.. ఈ సీజన్ లో రూ. 48వేలకు పెంచారు. విత్తనోత్పత్తి చేసే రైతులకు రుణ పరిమితి ఎక్కువగా ఉంది. మిర్చి పంటకు రూ.86వేల వరకు రుణం పొందొచ్చు. ఈ రుణ పరిమితి పెంపుతో రైతులు పంట సాగుకు కావలసిన పెట్టుబడులను సమకూర్చుకోవడానికి వీలు కలుగుతుంది