ప్రభుత్వంలో టాప్‌ సీక్రెట్‌ వ్యవహారాలు గులాబీ పెద్దలకు లీక్? సీఎం రేవంత్ సీరియస్, ఇంటెలిజెన్స్‌కు కీలక ఆదేశాలు..!

ఇంటి దొంగ‌ల‌ను ఈశ్వరుడైనా ప‌ట్టలేడ‌న్నట్లు.... స‌ర్కార్‌లో ఉంటూ... తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొంద‌రి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు.

ప్రభుత్వంలో టాప్‌ సీక్రెట్‌ వ్యవహారాలు గులాబీ పెద్దలకు లీక్? సీఎం రేవంత్ సీరియస్, ఇంటెలిజెన్స్‌కు కీలక ఆదేశాలు..!

Gossip Garage Leaks From Secretariat (Photo Credit : Google)

Updated On : September 26, 2024 / 10:48 PM IST

Gossip Garage : గోడ‌ల‌కు చెవులుంటాయి… ఇది పెద్దలు చెప్పిన మాట‌.. మ‌నం నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడుకున్న మాట‌లు కూడా… పూస‌గుచ్చిట్లు బ‌జారుకు చేరితే… ఏదో తేడా జరిగినట్లే… ఇక తెలంగాణ సెక్రటేరియట్‌లో కూడా ఎవరికీ తెలియకూడదనుకున్న సీక్రెట్లు…. ఉద్యోగ వర్గాల్లో షికారు చేస్తున్నాయట… సెక్రటేరియట్‌లో చీమ చిటుక్కుమన్నా గులాబీదళానికి తెలిసిపోతుందట… ప్రభుత్వంలో టాప్‌ సీక్రెట్‌ వ్యవహారాలు.. అంతఃపురం రహస్యాలు ఎలా లీకవుతున్నాయి…? ఇప్పుడు ఈ విషయంపైనే ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్‌ చేసిందట…

తెలంగాణ సెక్రటేరియట్‌లో లీకుల కలకలం..
తెలంగాణ సెక్రటేరియట్‌లో లీకులు క‌ల‌వ‌ర పెడ‌తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు గ‌డుస్తున్నా…. సచివాలయంలో గులాబీదళం వేగులు చురుగ్గా పనిచేస్తున్నారని ప్రభుత్వ పెద్దల్లో అనుమానం ఎక్కువవుతోందంటున్నారు. స‌ర్కార్ స‌మాచారం మొత్తం స‌చివాల‌యం గోడ దాటుతుండ‌టమే ప్రభుత్వ పెద్దల అనుమానాలకు కారణమంటున్నారు. గోడ‌ల‌కు చెవులు ఉన్నాయ‌న్నట్లు… నాలుగు గోడ‌ల మ‌ధ్య… మాట్లాడుకున్న స‌మ‌చారం కాస్త… గోడ దాటుతుండ‌టమే… ఇప్పుడు చ‌ర్చనీయాంశ‌ంగా మారింది.

ప్రభుత్వ స‌మాచారం లీక్ చేస్తున్నది ఎవరు?
అధికారంలోకి వ‌చ్చిన కొత్తలో… స‌ర్కార్ స‌మాచారం లీకవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్‌గా వార్నింగ్ ఇచ్చార‌ంటున్నారు. అధికారుల తీరు మార్చుకోవాలని… లేకపోతే… విష‌యం కాస్త సీరియ‌స్‌గా ఉంటుంద‌ని… స్మూత్ అండ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు టాక్. అయినా…. వ్యవ‌హారంలో మాత్రం నో ఛేంజ్ అంటున్నారు. ఎంత చెప్పినా… ఇన్ఫర్మేష‌న్ మాత్రం ష‌రా మామూలుగానే… బీఆర్ఎస్ భ‌వ‌న్‌కు చేరిపోతుంద‌ని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని కేటీఆర్ సైతం ప్రస్తావిస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఏం జ‌రుగుతందో… ఏం జరగనుందో మాకు తెలుస్తుందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు టాక్‌ నడుస్తోంది. ప్రభుత్వ స‌మాచారం లీక్ చేస్తున్నది ఎవరంటూ ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

క్షణాల్లో గులాబీ పెద్దల‌కు తెలిసిపోతుంద‌ట..!
స‌చివాయ‌లంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఉంటారు. స‌మీక్షలు, ప్రత్యేక స‌మీవేశాలు… వన్ టూ వన్ భేటీలు… ఇలా నిత్యం వివిధ శాఖ‌ల‌ పరిపాల‌న గురించి… మాట్లాడుకుంటుంటారు. అయితే…మంత్రుల ఛాంబ‌ర్ల‌ నుండి… సీఎం రేవంత్ ఉండే 6th ఫ్లోర్ వ‌ర‌కు… ఏ ఛాంబ‌ర్‌లో… ఎవ‌రు … ఎవ‌రితో మాట్లాడుకుంటున్నారు… ఏ అంశంపై మాట్లాడుకుంటున్నారు అన్నది… క్షణాల్లో గులాబీ పెద్దల‌కు తెలిసిపోతుంద‌ట‌. ఈ మ‌ధ్య జరిగిన మంత్రివర్గం సమావేశంపైనా గులాబీ ముఖ్య నేత … త‌న స‌న్నిహితుల ద‌గ్గర ప్రస్తావించిన సంగ‌తి సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు చేరింద‌టంటున్నారు. దీంతో… స‌చివాల‌యంలో ఏం జ‌రుగుతోంది అంటూ సీఎం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నార‌ని చెబుతున్నారు.

Also Read : రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత? కారణం అదేనా..

లీకుల వెన‌క ఉన్నది అధికారులా? నాయ‌కులా?
ఇంటి దొంగ‌ల‌ను ఈశ్వరుడైనా ప‌ట్టలేడ‌న్నట్లు…. స‌ర్కార్‌లో ఉంటూ… తిన్నింటి వాసాలను లెక్కపెడుతున్న ఆ కొంద‌రి పని పట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు. ఈ లీకుల వెన‌క అధికారులు ఉన్నారా? లేక నాయ‌కులు ఎవరైనా బీఆర్‌ఎస్‌ పెద్దలతో టచ్‌లో ఉంటూ ఇక్కడి విషయాలను అక్కడికి చేర్చుతున్నారా? అన్నది తేల్చాలని ఇంటిలిజెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారని సమాచారం….. ఎవ‌రు ఉన్నా…. సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే యాక్షన్ మాత్రం గ‌ట్టిగా ఉంటుంద‌నే చ‌ర్చ జరుగుతోంది. దీంతో లీకు వీరులు కొద్ది రోజులుగా గప్‌చుప్‌ అయిపోయారంటున్నారు.