సిర్పూర్ కాంగ్రెస్‌లో నేతల తలోదారి… ఆ ముగ్గురు నేతల మధ్య గ్యాప్ ఎందుకు?
ఈ ముగ్గురి మధ్య పంచాయితీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.

Gossip Garage : పార్టీ పవర్‌లో ఉంది. నియోజకవర్గంలో హస్తం హౌస్ ఫుల్ అయిపోయింది. అపోజిషన్‌లో ఉన్నవారు..పదవులపై కన్నేసిన వాళ్లు అంతా చేయి చెంతుకు చేరడంతో..కుస్తీ మొదలైందట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారట. ఆ ముగ్గురు నేతల తీరుతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.? ఆ ముగ్గురు హస్తం లీడర్ల మధ్య గ్యాప్ ఎందుకు.?
విఠల్ చేరికతో సిర్పూర్ హస్తం పార్టీలో త్రిముఖ పోరు..
కొమురంభీం జిల్లా సిర్పూర్-టి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిదే అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిర్పూర్ కాంగ్రెస్‌లో ఇద్దరు కీలక నేతలు చేరడంతో అసలు లొల్లి స్టార్ట్ అయింది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా గత పదేళ్ళుగా రావి శ్రీనివాస్ కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేశారు. ఆ తర్వాత కోనేరు కోనప్ప కారు దిగి హస్తం గూటికి చేరారు. వరుసకు మామా అల్లుళ్లు అయిన కోనప్ప రావి శ్రీనివాస్‌లకు రాజకీయ వైరుద్యం ఉంది. అయితే ఒకే పార్టీలో ఇద్దరు నేతలు ఉండటంతో పాత-కొత్త నేతలంతా కలిసి పని చేయాలని నిర్ణయించుకొని ముందుకెళ్ళారు. ఇంతలోనే ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్‌లో చేరడంతో సిర్పూర్ హస్తం పార్టీలో త్రిముఖ పోరు మొదలైంది.
పరోక్షంగా ఎమ్మెల్సీ దండె విఠల్ కు వార్నింగ్..
ఈ మధ్య సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పీక్ లెవల్‌కు చేరుకున్నాయి. స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. దండె విఠల్ వర్గం కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఫొటోను ఫ్లెక్సీలో పెట్టలేదని రచ్చ జరిగింది. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ దండె విఠల్ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారంటూ నియోజకవర్గ ఇంచార్జ్ రావి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. ఓ వైపు పార్టీలో విభేదాలు లేవని చెప్తూనే.. కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని పరోక్షంగా ఎమ్మెల్సీ దండె విఠల్‌ను హెచ్చరించారు రావి శ్రీనివాస్.
ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్‌లో చేరి వర్గపోరును ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం..
ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ దండె విఠల్ కాంగ్రెస్‌లో చేరి వర్గపోరును ప్రోత్సహిస్తున్నారంటూ కోనేరు కోనప్ప పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. తన అభిమానులు, ఫాలోవర్స్ ఒత్తిడితో ఇకపై న్యూట్రల్‌గా ఉండాలని కోనేరు కోనప్ప నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు తనకే ఇస్తారంటూ ఎమ్మెల్సీ దండె విఠల్, అతని అనుచరులు ప్రచారం చేస్తుకుంటున్నారని మండిపడుతున్నారు రావి శ్రీనివాస్. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇంచార్జ్ బాధ్యతలను దండె విఠల్‌కు అప్పగిస్తానంటున్నారు రావి శ్రీనివాస్.
నేతల మధ్య గొడవకు ఆ మంత్రే కారణం?
ఇలా పార్టీ నేతలు మూడు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క దృష్టికి ఈ వర్గపోరు అంశం చాలాసార్లు తీసుకెళ్లినా..ఆమె పెద్దగా పట్టించుకోలేదట. ఇక సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నేతల మధ్య గొడవకు ప్రత్యక్షంగా పరోక్షంగా మంత్రి సీతక్కే కారణమని సొంత పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. అన్నీ తెలిసినా పార్టీ నేతలు విభేదాలతో రోడ్డెక్కినా ఇంచార్జ్ మంత్రి సీతక్క మౌనంగా ఉండటం, అందరినీ సమన్వయం పరచకపోవడమేంటో అర్థం కావడం లేదంటున్నారు. ఈ ముగ్గురి మధ్య పంచాయితీకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..ఈ గందరగోళానికి ముగింపు దొరికేదెప్పుడని చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు.
Also Read : కేసీఆర్ ఏం ప్లాన్ వేస్తున్నారు? దానికి రేవంత్ దగ్గరున్న విరుగుడు ఏంటి?