Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ నెక్స్ట్ స్టెప్ తెలంగాణలోనేనా? ఏ పార్టీ కోసం పని చేయబోతున్నారు? టార్గెట్ ఎవరు?
మరో రెండున్నరేళ్లలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో ఓ రాజకీయ పార్టీతో కలిసి పీకే పనిచేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఏ పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారన్నదే ఆసక్తికరంగా మారింది.
- తమిళనాడులో విజయ్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్.!
- తెలంగాణలో పీకే ఏ పార్టీ కోసం పనిచేయబోతున్నారు.?
- కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దూరంగా పీకే.?
- పీకే వ్యూహాలు టీఆర్ఎస్ కోసమా.? బీఆర్ఎస్ కోసమా.?
Prashant Kishor: ఆయనో పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇప్పుడో పొలిటికల్ పార్టీ అధినేత. గతంలో ఏపీలో వైసీపీకి..తమిళనాడులో డీఎంకేకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. లేటెస్ట్గా తమిళనాడులో విజయ్ విజయం వెనుక కీరోల్ ప్లే చేశారు. ఇక నెక్స్ట్ పీకే ఫోకస్ అంతా తెలంగాణపైనే అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో ఏ పార్టీ కోసం వర్క్ చేయబోతున్నారు.? తెలంగాణలో ఎవరిని ఓడించాలనేది పీకే టార్గెట్.?
ప్రశాంత్ కిశోర్. ఈ పేరు నేషనల్ పాలిటిక్స్‌తో పాటు తెలుగు స్టేట్స్‌లోనూ చాలా పాపులర్. పబ్లిక్ పల్స్‌కు తగ్గట్లుగా..రాజకీయ పార్టీల అధినేతకు డైరెక్షన్స్ ఇస్తూ.. ఎన్నికల్లో గెలిచే వ్యూహాలను అమలు చేసే స్ట్రాటజిస్టే ప్రశాంత్ కిశోర్. గతంలో ఏపీలో వైఎస్ జగన్..తమిళనాడులో స్టాలిన్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా సలహాలు, సూచనలు అందించి..అధికారంలోకి వచ్చేందుకు సజీషన్స్ ఇచ్చారు. లేటెస్ట్గా అదే తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. గతంలో జాతీయస్థాయిలో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే..ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పార్టీలకు పనిచేసి అధికారం కట్టబెట్టడంలో కీరోల్ ప్లే చేశారు. అయితే గత కొన్నేళ్లుగా పీకే వ్యూహాలపై అనుమానాలు వ్యక్తమైనా..తమిళనాడులో విజయ్‌కి విజయం సాధించిపెట్టడంతో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు పీకే.
తెలంగాణలో ఏ పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారు?
ఇక ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ స్టెప్ తెలంగాణలోనే చర్చ మొదలైంది. మరో రెండున్నరేళ్లలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తెలంగాణలో ఓ రాజకీయ పార్టీతో కలిసి పీకే పనిచేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఏ పార్టీకి వ్యూహాలు రచించబోతున్నారన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీకే పనిచేసే అవకాశం లేదు. గతంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. అంతేకాదు తెలంగాణలో రేవంత్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి రానివ్వనని ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు. కాబట్టి పీకే కాంగ్రెస్ కోసం పనిచేసే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీకి కూడా పీకే వ్యూహాలు రచించే ఛాన్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. సైద్ధాంతిక పరంగా పీకే బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడానికే ఎక్కువగా మొగ్గు చూపడమే ఇందుకు కారణమంటున్నారు.
పీకేను వ్యూహకర్తగా నియమించుకునే ఆలోచనలో బీఆర్ఎస్?
ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, లేదంటే కవిత టీఆర్ఎస్ పార్టీకి పనిచేసే అవకాశాలు ఉన్నాయట. గతంలో ప్రశాంత్ కిశోర్ టీమ్ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసింది. 2023 ఎన్నికల సమయంలో కొన్ని కారణాలతో ఆ బంధం తెగిపోయినా, ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేసీఆర్ మళ్లీ పీకే వైపు చూసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పీకే మార్క్ రీ-బ్రాండింగ్ అవసరమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకునే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా టాక్ బయలుదేరింది.
ఇక తమిళనాడులో విజయ్ లాగే, తెలంగాణలో కూడా కొత్త రాజకీయ పార్టీ పెట్టారు కవిత . దీంతో ప్రశాంత్ కిశోర్ ని స్ట్రాటెజిస్ట్ గా పెట్టుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది .. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు క్రమంగా బలపడుతున్న బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. పార్టీ ప్రకటించకముందే ప్రశాంత్ కిశోర్‌తో కవిత ఓ సారి భేటీ అయ్యారు. అప్పుడే ప్రాథమికంగా పార్టీ ఏర్పాటుపై చర్చించారని తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి లేదంటే కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన కోసం పనిచేసే అవకాశం ఉందన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పీకే మ్యాక్సిమమ్ గెలిచే పార్టీలవైపే మొగ్గు చూపుతారన్న టాక్ కూడా ఉంది. ఆ లెక్కన పీకే ఎవరికి తన వ్యూహాలు అందిస్తారో చూడాలి.
Also Read: నేషనల్ పాలిటిక్స్‌లోకి రేవంత్..!? సత్తా చాటగలరా?
