Gossip Garage : వెండి తెరమీద కనిపించబోతున్న పొలిటికల్ స్టార్స్..! ఎవరా ముగ్గురు? ఏంటా సినిమాల కథ?

మొత్తం మీద ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు..వరుసగా సినిమాల్లో నటించడం అయితే తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది.

Gossip Garage : వెండి తెరమీద కనిపించబోతున్న పొలిటికల్ స్టార్స్..! ఎవరా ముగ్గురు? ఏంటా సినిమాల కథ?

Updated On : March 19, 2025 / 2:13 AM IST

Gossip Garage : ఆ ముగ్గురు హస్తం లీడర్లు. ఇద్దరు ఎమ్మెల్సీలు. ఓ మాజీ ఎమ్మెల్సీ. పొలిటికల్ లైఫ్‌ లో బిజీబిజీగా ఉంటే లీడర్స్ కాస్త వెండి తెరమీద కనిపించబోతున్నారు. ఆ ముగ్గురిలో ఓ లీడర్ ఆల్రెడీ సినిమాలో నటించి.. ఆ ఇమేజీతో రాజకీయం చేస్తుంటే.. మిగిలిన ఇద్దరు లీడర్లు మాత్రం పాలిటిక్స్‌లో గుర్తింపు వచ్చాక.. సిల్వర్‌ స్ర్రీన్‌ మీద కనిపించేందుకు తహతహలాడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు నటించిన సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా.. ఆ మాజీ ఎమ్మెల్యే మూవీ మాత్రం ఉగాదికి మొదలు అవుతుండగా… ఆ క్రేజీ పొలిటీషియన్‌ ఏకంగా వన్‌ ఇయర్‌ కాల్‌ షీట్స్‌ ఇచ్చేశాడట ఆ మూవీ కోసం… ఇంతకు ఆ ముగ్గురు పొలిటీషియన్స్‌ ఎవరు… వారి సినిమాల కథేంటి…

సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్‌గా రాణించడం చూశాం. అలాంటి వాళ్లలో విజయశాంతి ఒకరు. రాములమ్మగా వెండితెరమీద ఓ వెలుగు వెలిగిన విజయశాంతి.. రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు చాలా కాలం దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆ మధ్య మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు మళ్లీ సన్‌ ఆఫ్ వైజయంతి మూవీలో తన యాక్షన్‌తో ఆకట్టుకోబోతున్నారు. ఈ మధ్యే కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు ముందుకు రానుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

పాన్ ఇండియా లెవల్‌లో వస్తున్న మూవీ..
ఇక మరో కాంగ్రెస్‌ నేత..లేటెస్ట్‌గా విజయశాంతితో పాటు ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్‌ కూడా ఓ సినిమాలో నటించారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయిపోయింది. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఇండియా ఫైల్స్ మూవీలో కీలక పాత్రలో నటించారు అద్దంకి దయాకర్. ఉద్యమ కారుడిగా, కాంగ్రెస్‌ నేతగా ఉన్న అద్దంకి దయాకర్.. ఓ సినిమాలో కీలక పాత్రలో నటించడం..అది త్వరలోనే రిలీజ్ కానుండటం ఆసక్తిరేపుతోంది. ఆయన నటించిన ఇండియా ఫైల్స్ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో వస్తుందన్న టాక్‌తో.. ఆ మూవీకి, అద్దంకికి మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read : ఆ సీటుకు బైపోల్‌ పక్కానా? వాళ్లు డిసైడ్ అయ్యారా? కేటీఆర్ భేటీ అందుకేనా?

ప్రేమ కథా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు…
ఇక పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మరో నేత మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గన్న. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి..పొలిటికల్‌గా ఈ పేరు చాలా పాపులర్. పండుగులు, పబ్బాలు గ్రాండ్‌గా నిర్వహించి పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్‌ చేసే జగ్గారెడ్డి..ఓ ప్రేమ కథా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ మూవీ పేరే జగ్గారెడ్డి కావడం…దాని ట్యాగ్‌ లైన్‌ ఎ వార్ ఆఫ్ లవ్‌ అని ఉండటం ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాదిలో రిలీజ్‌ చేయబోయే ఈ సినిమా షూటింగ్‌ సంవత్సరం పాటు కొనసాగనుంది. రాబోయే వన్ ఇయర్ జగ్గారెడ్డి ఈ మూవీ షూటింగ్‌లోనే బిజీగా ఉండనున్నారట.

లేడీ ఫైర్ బ్రాండ్‌..రాములమ్మ యాక్టింగ్..ఆమె నటించిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇండియా ఫైల్స్ మూవీలో కీలక పాత్రలో యాక్ట్ చేశారు. అయితే వాళ్లిద్దరు నటించిన రోల్స్‌ కంటే జగ్గన్న పాత్ర సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుందట. ఓ లవ్‌ స్టోరీ మూవీలో జగ్గారెడ్డి తన నిజ జీవిత పాత్ర పోషిస్తున్నారు. ఆయన నేపథ్యం, రాజకీయ అరంగేట్రం..ఎలా ఎదగారనేది కూడా మూవీలో చూపించబోతున్నారట.

సీఎం అవడమే తన రాజకీయ లక్ష్యం..
జగ్గారెడ్డి మాస్ లీడర్. మూవీలోనూ ఆయనది మాస్‌ క్యారెక్టర్‌ అనే అంటున్నారు. ఓ ప్రేమ జంట పెండ్లికి మాఫియాగా చెలామణీ అయ్యే పెద్దలు అభ్యంతరం చెప్తే .. ప్రేమ జంటకు అండగా ఆ మాఫియాను ఎదిరించే పెద్ద మనిషి పాత్రలో జగ్గారెడ్డి యాక్షన్ ఉంటుందట. సామాజిక నేపథ్యం, దేశ పరిస్థితులపై అద్దంకి దయాకర్ సినిమా చేశారు. విజయశాంతి అయితే ఓ డైరెక్టర్ కోరిక మేరకు క్యారెక్టర్ నచ్చి యాక్ట్ చేశారు. జగ్గారెడ్డి సినిమా మాత్రం ఆల్మోస్ట్‌ బయోగ్రఫీ అంటున్నారు. సీఎం అవడమే తన రాజకీయ లక్ష్యమని చెప్పుకున్న జగ్గారెడ్డి..నిజ జీవితం ఆధారంగా మూవీ తీసి రాజకీయంగా తన పాపులారిటీని ఇంకా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

Also Read : వర్మ నామినేటెడ్‌ పోస్ట్ తీసుకుంటారా? పదవుల రేసులో ఉన్న ఈ నేతలకు తీపికబురు ఎప్పుడు?

విజయశాంతి రీల్‌ టు రియల్‌ పాలిటిక్స్‌లోకి వచ్చి..అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంటే..జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ రియల్ పొలిటికల్ లీడర్లుగా ఎస్టాబ్లిష్ అయి..వెండి తెరమీద కనిపించబోతున్నారు. ఈ ముగ్గురిలో జగ్గారెడ్డి సినిమా మాత్రం సరికొత్తగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ముగ్గురు కాంగ్రెస్ లీడర్లు..వరుసగా సినిమాల్లో నటించడం అయితే తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది.