KTR-Kavitha: అన్న, చెల్లి టైటిల్ ఫైట్.. టీఆర్ఎస్ టైటిల్ దక్కేది ఎవరికి? బీఆర్ఎస్.. టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందా?
స్వాతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ తన పేరును మార్చుకోలేదు. ఓ పార్టీ రెండుగా విడిపోయి మరో పార్టీ ఏర్పడిన సందర్భాలున్నాయి. కానీ పార్టీ పేరు మార్చుకున్న సందర్భాలు లేవు.
Gossip Garage Trs Title Fight Between Ktr And Kavitha
- ఇంట్రెస్టింగ్గా మారిన టీఆర్ఎస్ టైలిల్ ఫైట్
- పాత పేరు..కొత్త ఎజెండా అంటూ కవిత హింట్
- తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావొచ్చంటూ లీక్
- టీఆర్ఎస్ పేరును మిస్ అవుతున్నామన్న కేటీఆర్
- టీఆర్ఎస్ టైటిల్ ఫైట్‌లో పైచేయి ఎవరిది?
KTR-Kavitha: పాత పేరు..కొత్త ఎజెండా అని చెల్లి. అయ్యో ఆ పేరు మిస్ అవుతున్నామని అన్నయ్య. అలా ఇద్దరు కామెంట్స్ చుట్టూ ఆసక్తి చర్చ మొదలైంది. టీఆర్ఎస్ అని పేరు వచ్చేలా తన పార్టీ పేరు ఉంటుందని కవిత లీక్ ఇచ్చారు. బీఆర్ఎస్ను..టీఆర్ఎస్గా పేరు మార్చితే బాగుంటుందని కేటీఆర్ అంటున్నారు. దీంతో అన్న, చెల్లి మధ్య టైటిల్ ఫైట్ అంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంతకు టీఆర్ఎస్ టైటిల్ ఎవరికి రానుంది? బీఆర్ఎస్..టీఆర్ఎస్గా మారే అవకాశం ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పోరు మొదలైంది. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన అన్నచెల్లెళ్లు కేటీఆర్, కవిత.. ఇప్పుడు గులాబీ జెండా వారసత్వం కోసం, ముఖ్యంగా TRS అనే బ్రాండ్ నేమ్ కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాతే పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని ఆ పార్టీ శ్రేణుల్లో బలమైన నమ్మకం ఉంది. దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం మళ్లీ టీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాం..పేరు మార్పు వల్లే నష్టపోయామంటూ చెప్పుకొచ్చారు.
తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావొచ్చన్న కవిత..
మరోవైపు, కవిత కూడా టీఆర్ఎస్ పేరుపై కన్నేశారన్న టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఆ టైటిల్‌ను ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాత పేరుతో, కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు చెప్పి చర్చకు తెరలేపారు. ఓవైపు తన పార్టీ పేరును తెలంగాణ ప్రజా జాగృతిగా ఈసీ దగ్గర రిజిస్టర్ చేశారు. ఆ టైటిల్ ఇవ్వట్లేదని కోర్టుకు కూడా వెళ్లారు. మరోవైపు తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావొచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వెనుక మర్మమేంటన్న చర్చ జరుగుతోంది. ఇదే టైమ్‌లో కేటీఆర్ టీఆర్ఎస్ పేరుపై రియాక్ట్ అవడం ఆసక్తికరంగా మారింది.
2022 డిసెంబర్ 8న కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ బులిటెన్ విడుదల చేసింది. 2022 డిసెంబర్ 9న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినట్లు ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. పార్టీ జెండా గులాబీ రంగు, కారు గుర్తు అలాగే కొనసాగుతుండగా జెండాపై ఉన్న తెలంగాణ మ్యాప్ స్థానంలో భారతదేశం మ్యాప్ వచ్చి చేరింది. అయితే పార్టీ పేరు మార్పు అప్పుడే తమ పాత టైటిల్ టీఆర్ఎస్ పేరును ఎవరికీ కేటాయించొద్దని ఈసీని రిక్వెస్ట్ చేసిందట బీఆర్ఎస్. దీంతో ఆరేళ్ల పాటు టీఆర్ఎస్ పేరును ఫ్రీజ్ చేస్తామని..బీఆర్ఎస్ కోరితే కూడా ఆ పేరును ఇవ్వబోమని చెప్పిందట.
స్వాతంత్ర భారత దేశంలో పార్టీ పేరు మార్చుకున్న సందర్భాలు లేవు..
స్వాతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ తన పేరును మార్చుకోలేదు. ఓ పార్టీ రెండుగా విడిపోయి మరో పార్టీ ఏర్పడిన సందర్భాలున్నాయి. కానీ పార్టీ పేరు మార్చుకున్న సందర్భాలు లేవు. దీంతో ఆల్రెడీ రిజిస్టర్ అయిన పార్టీ పేర్లు మారితే..పాత టైటిల్ విషయంలో ఏం చేయాలనేది కూడా ఈసీ గైడ్‌లైన్స్‌లో లేదంటున్నారు. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ టైటిల్ విషయం పెద్ద ఇష్యూగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు కోసం ఇటు కవిత కోర్టును ఆశ్రయించే చాన్స్ ఉండొచ్చు. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితే బాగుంటుందన్న కేటీఆర్..టీఆర్ఎస్ టైటిల్ కోసం ఈసీని రిక్వెస్ట్ చేయొచ్చు.
కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోకపోతే బీఆర్ఎస్ కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా టీఆర్ఎస్ టైటిల్ కోసం పట్టుబట్టొచ్చు. ఓవరాల్‌గా ఈ టైటిల్ ఇష్యూ పెద్ద రాద్దాంతం అయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. టీఆర్ఎస్ పేరుతో పెను సంచలనం సృష్టించిన ఆ టైటిల్..ఇప్పుడు సరికొత్త ఫైట్‌కు దారితీస్తోంది.
Also Read: ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆ రోజు నుంచి బస్సులు బంద్?
