Gossip Garage : ఈసారైనా వస్తారా? తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చే గెస్ట్ ఎవరు?

అందుకే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

Gossip Garage : ఈసారైనా వస్తారా? తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చే గెస్ట్ ఎవరు?

Updated On : November 29, 2024 / 1:28 AM IST

Gossip Garage : పవర్‌లో ఉన్నాం. ప్రతీ కార్యక్రమం దద్దరిల్లిపోవాల్సిందే. అందుకు తగ్గట్లుగా అధిష్టానం నుంచి అతిథి వస్తే క్యాడర్‌కు పూనకాలే అని ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్ సర్కార్. ఆహ్వానించాం కానీ అగ్రనేతలు వస్తారో రారో..అని డౌట్ పడుతున్నారట నేతలు. రాజీవ్‌ గాంధీ విగ్రహావిష్కరణకు ఎవరూ రాలే. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అయినా..గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా రారా అని ఎదురుచూస్తున్నారట లీడర్లు. సోనియా, రాహుల్‌కు వీలుకాకపోతే..ప్రియాంక గాంధీ వచ్చినా క్యాడర్‌లో ఫుల్‌ జోష్ వస్తుందని అనుకుంటున్నారట. ఇంతకీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చే గెస్ట్ ఎవరు?

డిసెంబర్ 9న సోనియా పుట్టిన రోజు..
సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే 10 12 రోజుల్లోనే ప్రొగ్రామ్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీలతో ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ సహా ఏఐసీసీ ముఖ్యనేతలందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం, అదే రోజు తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన రావడంతో..ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా గాంధీ కుటుంబం సభ్యులతో ఆవిష్కరింపజేస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

గాంధీ విగ్రహావిష్కరణకు దూరం..
అయితే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా వస్తారా..రారా అన్న డౌట్‌లో ఉన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వాళ్లెవ్వరూ హాజరవ్వలేదు. దీంతో సెక్రటేరియట్‌ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డే ఆవిష్కరించారు. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ రాకపోవడం వెనక మర్మం ఏముందన్న దానిపై..కాంగ్రెస్ నేతలు, పార్టీ క్యాడర్‌లోనూ జోరుగా చర్చ జరిగింది.

ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని ఆందోళన..
ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ వస్తారా రారా అని కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారట. సోనియా గాంధీ రాకపోయినా కనీసం రాహుల్ గాంధీ లేదంటే ప్రియాంక గాంధీ అయినా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. వయనాడ్‌ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక వచ్చినా క్యాడర్‌లో జోష్‌ వస్తుందని భావిస్తున్నారట. ఒకవేళ ఈ సారి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోతే పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని ఆందోళన చెందుతున్నారట కాంగ్రెస్ నేతలు. అందుకే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. మరి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అధిష్టానం పెద్దలు వస్తారో..రారో..వస్తే ఏ అగ్రనేత రాబోతున్నారో తెల్వాలంటే డిసెంబర్ 9వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read : తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ క్లాస్..! కారణం అదేనా?

Also Read : తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని మోదీ క్లాస్..! కారణం అదేనా?