CBI: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఆ కేసు కూడా సీబీఐకి బదిలీ..!

రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఆ కేసు విషయంలో రేవంత్ సర్కార్ నిర్ణయం ఏంటి? సీబీఐ ఎంట్రీతో ఏం జరగనుంది?

CBI: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..! రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఆ కేసు కూడా సీబీఐకి బదిలీ..!

Updated On : September 19, 2025 / 4:28 PM IST

CBI: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కేసు అది. గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన కేసు అది. దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించే యోచనలో ఉందట. అదే ఫోన్ ట్యాపింగ్ కేసు.

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపిన సిట్.. పలువురిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్, అడ్వకేట్ వామన్ రావు హత్య కేసులను సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా కేంద్ర దర్యాఫ్తు సంస్థకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది.

సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్, న్యాయవాది వామనరావు కేసులు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసుని సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత న్యాయవాది వామనరావు కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాఫ్తు ప్రారంభించింది. రెండు కేసుల్లో ఇప్పటికే సీబీఐ ఎంటర్ అయ్యింది. తాజాగా మూడో కేసుగా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ఉంది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఈ కేసుని సైతం సీబీఐకి ఇవ్వాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

గత ప్రభుత్వం హయాంలో 600కు పైగా ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎంపీలు, బీజేపీ నేతలు, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. రేవంత్ సర్కార్ వచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ని ఏర్పాటు చేసింది. చాలా మంది బాధితుల స్టేట్ మెంట్లను సిట్ నమోదు చేసుకుంది. అనేకమందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగిస్తే అసలు దోషులు ఎవరో బయటకు వచ్చే అవకాశం ఉంది.

సీబీఐ ఎంట్రీతో.. నిందితుల గురించి దేశం మొత్తం తెలిసే అవకాశం..

ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తే.. ఈ కేసులోని నిందితులు యావత్ దేశం తెలిసే అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండాలంటే ఈ కేసుని సీబీఐకి ఇస్తే బాగుంటుందనే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: RRR అలైన్‌మెంట్‌లో చిత్ర, విచిత్రాలు.. అడ్డగోలు మార్పులు వాటిని కాపాడేందుకేనా?