Telangana : రాష్ట్రాభివృద్ధికి కృషి చేయటంలో అధికారులు,నాయకులు రిలాక్స్ అవ్వొద్దు : సీఎం కేసీఆర్
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయటంలో అధికారులు,నాయకులు రిలాక్స్ అవ్వొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.వనపర్తి జిల్లాకేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎంప్రారంభించారు

Government Officials And Political Leaders Should Not Relax In Developing Telangana
CM KCR Inaugurates TRS party office In wanaparthy :రాష్ట్రాభివృద్ధికి కృషి చేయటంలో అధికారులు గానీ..నాయకులు గానీ ఎప్పుడు రిలాక్స్ అవ్వొద్దు అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఇతర రాష్ట్రాల అధికారులు నేర్చుకునేలా ఉండాలని సూచించారు. ఉద్యోగి రిటైర్ట్ అయ్యేలోపే బెనిఫిట్స్ అన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం నిధి నుంచి వనపర్తికి రూ. కోటి సహాయం చేస్తామని తరువాత అన్ని మున్సిపాలిటీలకు రూ.50 లక్షలు ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ పంచాయితీలకు అదనంగా రూ.20 లక్షలు ఇస్తామని అధికారులు, నాయకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎప్పుడూ రిలాక్స్ అవ్వొద్దని కష్టపడి పనిచేయాలని అధికారులకు,నాయకులకు సూచించారు.
Also read : Director Bala : ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యతో విడిపోయిన స్టార్ డైరెక్టర్
వనపర్తి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.ఆ తరువాత కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్‌ను కేసీఆర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఒకప్పుడు పాలమూరు అంటే కరవు జిల్లా..వలసల జిల్లాగా పేరుండేది. కానీ ఇప్పుడలా కాదు..సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం..అన్ని జిల్లాలతో పాటు వనపర్తి, పాలమూరు జిల్లాలు కూడా చక్కగా పంటలు పండించుకోగలుగుతున్నామని అన్నారు.
ఒకప్పుడు కరవుతో అల్లాడే వనపర్తిలో ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తోందని..చక్కటి కలెక్టరేట్ ను కూడా నిర్మించుకున్నామని..చూడచక్కని రోడ్లను కూడా నిర్మించుకున్నామని అన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్నాక టీఆర్ఎస్ పార్టీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నందుకు వల్ల కరవును మాయం చేసామని..పంటలు చక్కగా పండుతున్నాయని అన్నారు. అనేక విషయాల్లోను తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ గా ఉందని అన్నారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీటిని సపఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
Also read : మహిళా పారిశ్రామిక పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
వనపర్తిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కంటే ముందు వనపర్తి జిల్లా కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. చిట్యాలలో వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.