పెళ్లికి ముందు ఒకరోజు మరో యువతితో వరుడు పరార్.. వాళ్ల అమ్మ, నాన్న ఇంకా హుషారు.. విషయం దాచిపెట్టి ఏం చేశారంటే..

పెళ్లికి ముందు ఒకరోజు వరుడు మరో యువతితో వెళ్లిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

పెళ్లికి ముందు ఒకరోజు మరో యువతితో వరుడు పరార్.. వాళ్ల అమ్మ, నాన్న ఇంకా హుషారు.. విషయం దాచిపెట్టి ఏం చేశారంటే..

Groom Madhukar Reddy

Updated On : May 17, 2025 / 8:40 AM IST

Karimnagar District: మరికొద్ది గంటల్లో పెళ్లి.. వధువు, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెండ్లి మండపానికి చేరుకున్నారు. అయితే, వరుడు, వారి కుటుంబ సభ్యులు మాత్రం పెండ్లి మండపానికి రాలేదు. దీంతో కంగారుపడిన వధువు కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ఆరాతీశారు. అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఇదేంటి.. ఇలా చేశారంటూ వరుడు తల్లిదండ్రులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Hyderabad: క్రెడిట్ కార్డు పేమెంట్ ఎప్పుడు కడతావ్? అంటే.. కుక్కని వదిలిన ఓనర్!

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కుంట మధుకర్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం కాట్రపల్లికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చమైంది. యువతి కుటుంబ సభ్యులు మధుకర్ రెడ్డికి రూ.40లక్షల విలువైన అర ఎకరం భూమి, 10 తులాల బంగారం, రూ.6 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. శుక్రవారం (16వ తేదీ) ఉదయం 9.30గంటలకు హుజురాబాద్ లోని సాయిరూప ఫంక్షన్ హాల్ లో వివాహం జరిపించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయాన్నే పెళ్లికి కొద్దిగంటకు ముందు వధువు, వారి కుటుంబ సభ్యులు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అయితే, అక్కడ వరుడు, వారి కుటుంబ సభ్యులు కనిపించకపోవటంతో కంగారుపడ్డారు. స్థానికులను ఆరాతీయగా అసలు విషయం తెలిసి కంగుతిన్నారు.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ లబ్ధిదారులూ బీ అలర్ట్.. తప్పుడు సమాచారం ఇస్తే ఇబ్బందులే.. వెంటనే పట్టేస్తోన్న ఏఐ..! ఎలా అంటే..?

వరుడు మధుకర్ రెడ్డి వివాహానికి ముందురోజే మరో యువతిని పెండ్లి చేసుకొని పారిపోయాడు. ఈ విషయం తెలియక వధువు, ఆమె కుటుంబ సభ్యులు పెండ్లి మండపానికి వచ్చారు. మధుకర్ రెడ్డి ఘనకార్యం తెలిసిన తరువాత వధువు కుటుంబ సభ్యులు, వారి బంధువులు వరుడు ఇంటివద్దకు వెళ్లి అతడి తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. వరుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.