TSPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 పోస్టులు 503 కాదు.. 563

అలాగే, ఈ ఉద్యోగాల భర్తీకి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు..

TSPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 పోస్టులు 503 కాదు.. 563

Group 1 Posts

Updated On : February 6, 2024 / 6:14 PM IST

గ్రూప్-1 పోస్టులను పెంచుతూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఉన్న పోస్టులకు మరో 60 పోస్టులు కలిపి భర్తీకి ఆమోదం తెలిపింది. 503 పోస్టులకు గతంలో నోటిఫికేషన్‌ వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో 60 పోస్టులతో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 563కి పెరిగింది. అలాగే, ఈ ఉద్యోగాల భర్తీకి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా, గ్రూప్‌-1లో 19 విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా ఎంపిక చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 2023 జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. పేపర్‌ లీకేజీ వల్ల మొదటిసారి, బయోమెట్రిక్ వివాదం-హైకోర్టు ఆదేశాల తర్వాత రెండోసారి పరీక్ష రద్దయింది.

పూర్తి వివరాలు..

 

 Read Also: కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు సానియా మీర్జా ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?