Gutha Sukender Reddy: కాంగ్రెస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు
అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే.

Gutha Sukender Reddy
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరతారని ఇటీవల ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ పార్టీపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలు సరికాదని అన్నారు.
ఎమ్మెల్యేల అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కొంపముంచిందని విమర్శలు చేశారు. ఆ పార్టీలో సమన్వయలోపం ఉందని అన్నారు. ఆ పార్టీకి ఇప్పటికి కూడా సరైన నిర్మాణం లేదని చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. దీంతో ఆయన కూడా పార్టీ వీడతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన కుమారుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు పెరిగాయి. వరుసగా నేతలు బీఆర్ఎస్ పార్టీకి షాకులు ఇస్తున్నారు. గుత్తా అమిత్ రెడ్డి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి లేదా నల్గొండ స్థానంలో పోటీ చేద్దామని భావించారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు.
Also Read: ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల