డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో సంచలన విషయాలు.. రీల్స్ పాపతో భర్త ప్రేమాయణం.. ప్రశ్నించినందుకు వేధింపులు.. విడాకుల పేరుతో..

హనుమకొండ జిల్లాలో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆమె మృతికి కారణమైన నలుగురిపై కేసులు నమోదు చేశారు.

డాక్టర్ ప్రత్యూష సూసైడ్ కేసులో సంచలన విషయాలు.. రీల్స్ పాపతో భర్త ప్రేమాయణం.. ప్రశ్నించినందుకు వేధింపులు.. విడాకుల పేరుతో..

doctor prathyusha

Updated On : July 15, 2025 / 2:49 PM IST

warangal hasanparthy doctor prathyusha case: హనుమకొండ జిల్లాలో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఆమె మృతికి కారణమైన నలుగురిపై కేసులు నమోదు చేశారు. మృతిరాలి భర్త డాక్టర్ అల్లాడి సృజన్ తోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బానోత్ శృతి, అల్లాడి మధుసూదన్, అల్లాడి పుణ్యవతిలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యూష భర్త సృజన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట.. ఉరిశిక్షను వాయిదా వేసిన యెమెన్ ప్రభుత్వం

డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హసన్‌పర్తిలోని తన నివాసంలో ప్రత్యూష ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతిరాలి భర్త సృజన్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాలజీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రత్యూష కూడా డెంటిస్ట్ గా పనిచేస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బానోత్ శృతితో సృజన్ కు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పలుసార్లు పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్‌లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సృజన్‌తోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శృతి, సృజన్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. సృజన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇన్ఫ్లుయెన్సర్ శృతితో కొన్నాళ్లుగా సృజన్ చనువుగా ఉంటూ ఇల్లీగల్ ఎపైర్ కొనసాగిస్తున్నట్లు తేలింది.

ఇన్ఫ్లుయెన్సర్ బుట్టబొమ్మ బానోతు శృతి ప్రేమలో పడి భార్య డాక్టర్ ప్రత్యూషను సృజన్ వేధించేవాడు. నీకు విడాకులు ఇచ్చి శృతిని పెళ్లి చేసుకుంటానని భార్యపై పలు సార్లు దాడి చేసినట్లు తెలిసింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ భర్త తీరులో మార్పురాకపోవటంతో.. భర్త వేధింపులు తట్టుకోలేక ప్రత్యూష సూసైడ్ చేసుకుంది. అయితే, పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. శృతితోపాటు సృజన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది.