Harish Rao: రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఓ గ్రహణంలా పట్టారు: హరీశ్ రావు
రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు.

Harish rao
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలనా దక్షతలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన చేత కాదని నిరూపణ అయ్యిందని చెప్పారు. ఇవాళ జనగామలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఓ గ్రహణంలా పట్టారని, ఆయన పాలన అంతా 20-20 కమీషన్ పాలనేనని హరీశ్ రావు ఆరోపించారు. పాలన చేతగాక ప్రకృతి పైన, ప్రతిపక్షాలపైన నిందలు వేస్తున్నారని చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరవని అన్నారు.
Also Read: బంగారం కొంటున్నారా? తక్కువ ధరకు ఎక్కడ కొనుక్కోవచ్చో తెలుసా? భారత్‌తో పోల్చితే..
రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్ ప్రతి చుక్కను ఒడిసి పట్టారని, కాబట్టే పదేళ్లలో ఎప్పుడు కరవు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డికి చేతకాకే నీరంతా సముద్రపు పాలు చేశారని హరీశ్ రావు విమర్శించారు.