మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ ఉండాలా? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ఉండాలో ఆలోచించాలి

  • Published By: naveen ,Published On : October 16, 2020 / 12:55 PM IST
మోటార్లకు మీటర్లు పెట్టే బీజేపీ ఉండాలా? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ఉండాలో ఆలోచించాలి

Updated On : October 16, 2020 / 1:14 PM IST

harish rao: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేటలో మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేసింది అని ప్రశ్నించారు. బీజేపీకి రాష్ట్రంలో ఏముంది అని అడిగిన హరీష్ రావు, బీజేపీతో ఏమీ కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తాగు, సాగునీరు ఇస్తోందన్నారు.