Telangana : భారీ వర్షాలకు నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్‌ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Telangana : భారీ వర్షాలకు నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

Project

Updated On : July 10, 2022 / 8:21 PM IST

heavy rains : తెలంగాణలో కుండపోత వానలు దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్లు ఏకథాటిగా భారీ వర్షం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముంది.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్‌ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది.

CM KCR : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి భారీగా నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలి పెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్‌లోకి 5 లక్షల 58 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో 65 గేట్లు ఎత్తి 5 లక్షల 84 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. 3లక్షల 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 48 టీఎంసీ నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌ నీటిమట్టం వెయ్యి 91 అడుగులకుగాను వెయ్యి 78 అడుగుల మేర నీరు చేరింది.