Allu Arjun Arrest : హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఇంకా జైల్లోనే అల్లు అర్జున్.. కారణం ఏంటంటే..

జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Allu Arjun Arrest : హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఇంకా జైల్లోనే అల్లు అర్జున్.. కారణం ఏంటంటే..

Allu Arjun

Updated On : December 13, 2024 / 11:07 PM IST

Allu Arjun Arrest : అల్లు అర్జున్ విడుదల వ్యవహారం హైడ్రామాను తలపిస్తోంది. చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. చంచల్ గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్.. బెయిల్ ఆర్డర్ కాపీల కోసం ఎదురు చూస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. ఆ కాపీలు ఆన్ లైన్ లో అప్ లోడ్ కాలేదు. దీంతో జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేయడం లేదు. ఇటు జైలు వద్దకు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు చేరుకోగా.. జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. జడ్జి నుంచి బెయిల్ ఆర్డర్ కాపీలు ఇంకా జైలు సిబ్బందికి అందకపోవడంతో అల్లు అర్జున్ విడుదలలో కొంత జాప్యం జరుగుతోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చాక.. అల్లు అర్జున్ లాయర్లు ఒక కాపీని జైలుకి తీసుకొచ్చారు. అయితే, ఆ కాపీకి సంబంధించి ఎలాంటి సీల్ లేదు, జడ్జి సంతకం కూడా లేదు. దీంతో జైలు అధికారులు ఆ కాపీని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఇవాళ రాత్రి 7 లేదా 8 గంటలకు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. కానీ, బెయిల్ ఆర్డర్ కు సంబంధించిన కాపీలు ఇంకా జైలు ఉన్నతాధికారులకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల మరింత ఆలస్యం అయ్యింది.

బెయిల్ ఆర్డర్ కాపీ అప్ లోడ్ కు సంబంధించిన ప్రక్రియ హైకోర్టులో ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అక్కడి నుంచి జైలు ఉన్నతాధికారులకు మెయిల్ రావాల్సి ఉంటుంది. దాన్ని జైలు ఉన్నతాధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కు సంబంధించిన న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకుని జైలు వద్దకు చేరుకున్నారు. అయితే, అందులో సీల్ లేదు, సంతకాలు లేవు. మధ్యంతర బెయిల్ ఆర్డర్ కు సంబంధించి తమకు ఆన్ లైన్ లో అప్ లోడ్ అయితే మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకుంటాం. కానీ, ఇలా బై హ్యాండ్ ఇచ్చిన పేపర్లను ధృవీకరించలేము అని జైలు అధికారులు.. అల్లు అర్జున్ న్యాయవాదులకు తేల్చి చెప్పారు. మొత్తంగా రాత్రి 11.30 తర్వాతే జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

* అల్లు అర్జున్ విడుదలపై సస్పెన్స్..
* అధికారికంగా బెయిల్ ఆర్డర్ కాపీలు అందలేదంటున్న చంచల్ గూడ జైలు అధికారులు..
* అల్లు అర్జున్ లాయర్లు తెచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీలో తప్పులు..
* ఆర్డర్ కాపీలో తప్పుల సవరణ కారణంగా ఆలస్యం..

Also Read : అల్లు అర్జున్ ఏమీ తీవ్రవాది కాదు..! అరెస్ట్ వ్యవహారంపై ప్రొ.నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు