Traffic Challan Payment: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ఇలా సులభంగా కట్టండి.. బంపర్ ఆఫర్‌ను వినియోగించుకోండి
మీ వాహనంపై చలాన్లు ఉన్నాయో లేదో ఇలా చూసుకోండి.. ట్రాఫిక్ చలాన్లను కట్టాలంటే ఇలా చేయండి..

Traffic challans
Telangana Police: వాహనాల పెండింగ్ చలాన్లపై తెలంగాణ పోలీసులు రాయితీ ప్రకటించడంతో చాలా మంది వాటిని చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా వాహనదారులు ఫైన్లు కట్టవచ్చు.
రాష్ట్రంలోని అనేక వాహనాలపై చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో ఇప్పటికే చాలా మంది echallan వెబ్‌సైటులో వివరాలు చూసుకుంటున్నారు. తమ వాహనాలపై ఏమైనా చలాన్లు ఉన్నాయా? అనే విషయాన్నీ నిర్ధారించుకునేందుకు కూడా చాలామంది ఒకేసారి echallan వెబ్‌సైటును ఓపెన్ చేస్తుండడంతో అది స్లోగా ఓపెన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
మీ వాహనంపై చలాన్లు ఉన్నాయో లేదో ఇలా చూసుకోండి.. ట్రాఫిక్ చలాన్లను కట్టాలంటే ఇలా చేయండి..
- TS e challan అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేయండి
- e-challan ట్యాబ్ కనపడుతుంది.. దానిపై క్లిక్ చేయండి
- https://echallan.tspolice.gov.in/publicview/#tabs-8 ఓపెన్ అవుతుంది
- Vehicle No అని ఉన్న చోట మీ వాహన నంబరును టైప్ చేయండి
- New Question అని ఉన్న చోట సరైన సమాధానాన్ని టైప్ చేయండి
- మీ వాహనంపై చలాన్లు ఉంటే మీరు ఎంత కట్టాల్సి ఉంటుందన్న వివరాలు వస్తాయి
- చలాన్ ప్రింట్ కావాలంటే తీసుకోవచ్చు
- మీ వాహనంపై చలాన్లు లేకపోతే నో పెండింగ్ చలాన్స్ అని కనపడుతుంది
- మీ వాహనంపై చలాన్లు ఉంటే ఇక్కడే వాటిని కట్టొచ్చు
- మీ చలాన్‌కు ఎడమ వైపున కనపడే సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేయండి
- ఆ తర్వాత కింద మూడు ఆప్షన్లు ఉంటాయి.. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టాలనుకుంటే నెట్ బ్యాంకింగ్ పై క్లిక్ చేయండి
- యూపీఐ వ్యాలెట్, బ్యాంకుల ట్యాబ్ లు కనపడతాయి
- అక్కడ కనపడే మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి
- మీ మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంట్రీ చేయండి
- ఆ తర్వాత కింద కనపడే పేమెంట్ పై క్లిక్ చేయండి
- మీ బ్యాంక్ డెబిట్ కార్డు నంబరు, పిన్ నంబరు ఎంటర్ చేసి చలాన్ కట్టొచ్చు
Traffic echallan: పెండింగ్ చలాన్లపై బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ల వివరాలు ఇవిగో..