Encoumnter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్.. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు?

ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నగారాం మండలం చల్పాక - కొండాయి అటవీ ప్రాంతంలో

Encoumnter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్.. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు?

forest

Updated On : December 1, 2024 / 9:13 AM IST

Encoumnter in Mulugu District: ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారు జామున ఏటూరు నగారాం మండలం చల్పాక – కొండాయి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లందు – నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు, అలియాస్ పాపన్నకూడా భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో మరణించినట్లు సమాచారం.

 

తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్వ్కాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, ఈ ఎన్ కౌంటర్ ను పోలీసులు అధికారికంగా ఇప్పటి వరకు ధృవీకరించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.