Hyderabad: భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకొని ఆ తరువాత ఏం చేశాడంటే.. అందరూ పరుగులు తీశారు..
సికింద్రాబాద్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

Hyderabad
Hyderabad: సికింద్రాబాద్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. ఓ బట్టల దుకాణంలో కస్టమర్లు ఉండగానే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. దీంతో దుకాణంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. కొందరు అతనికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని తీవ్రంగా కాలిన గాయాలతో పడిఉన్న వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. షాపులోని వారు బయటకు పరుగులు తీయడంతో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు.
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. భర్త శ్రావణ్, భార్య మౌనిక. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మౌనిక సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది. భార్యపై కోపంతో ఆమె పనిచేసే బట్టల దుకాణంలోకి శ్రవణ్ వెళ్లాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడ్డాడు. భార్యసైతం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో శ్రవణ్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో షాపులోని వారు భయాందోళనకుగురై బయటకు పరుగులు తీశారు.
షాపులోని కొందరు అప్రమత్తమైన శ్రవణ్ కు అంటుకున్న మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. షాపులో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టుపక్కల దుకాణదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షాపులో ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంకు చేరుకొని దుకాణంలో చెలరేగిన మంటలను, పొగలను అదుపులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని శ్రవణ్ ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎందుకు ఘర్షణ జరిగిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రవణ్ పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.