10TV Beyond Borders: భారత రక్షణ రంగంలో హైదరాబాద్ రేంజ్ ఇదే..: డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ సతీశ్ రెడ్డి
"ఇక్కడి నుంచి మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, మిస్సైల్స్, లేజర్స్ వంటివి ఎన్నో తయారయ్యాయి. వాటిని దేశానికి అందించాం. రక్షణ రంగంలో మన దేశాన్ని చాలా శక్తిమంతం చేశాయి మిస్సైల్. వీటికి కేంద్రం హైదరాబాదే" అని అన్నారు.
DRDO Former Chairman Satheesh Reddy
- రక్షణ రంగ ఇండస్ట్రీలు 50% పైగా హైదరాబాద్‌లోనే
- ఇక్కడి నుంచే ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, మిస్సైల్స్
- శాటిలైట్లను ధ్వంసం చేయగలిగే క్షిపణి తయారైంది
10TV Beyond Borders: భారత్‌లో రక్షణ రంగంలో పనిచేసే ఇండస్ట్రీలు దాదాపు 50 శాతానికి పైగా హైదరాబాద్‌లోనే ఉన్నాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మాజీ ఛైర్మన్, ఎన్‌ఎస్‌ఏబీ సభ్యుడు డా.జి.సతీశ్ రెడ్డి అన్నారు. 10TV బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ, అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Also Read: 10TV Beyond Borders: 10TV బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ.. సగర్వంగా అవార్డుల ప్రదానం
“ప్రస్తుతం డీఆర్‌డీవోకి ఛైర్మన్‌గా ఉన్న కామత్ సహా ఈ సంస్థకు ఛైర్మన్లుగా వచ్చినవాళ్లు సగానికి పైగా ఈ ప్రాంతానికి చెందినవారే. ఇంత మందిని తీసుకురాగలిగిన వ్యవస్థ ఇక్కడ ఉంది. అంత ప్రాధాన్యం ఉన్న ప్రయోగశాలలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడి నుంచి మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, మిస్సైల్స్, లేజర్స్ వంటివి ఎన్నో ఇక్కడే తయారయ్యాయి. వాటిని దేశానికి అందించాం. రక్షణ రంగంలో మన దేశాన్ని చాలా శక్తిమంతం చేశాయి మిస్సైల్. వీటికి కేంద్రం హైదరాబాదే.
మిస్సైల్స్ ప్రపంచ దేశాలతో పోటీ పడే మిస్సైల్స్ తయారు చేశాం. పృథ్వీ, ధనుష్, అగ్ని సిరీస్‌లు, ఆకాశ్ సిరీస్‌లు, మొన్న పరీక్షించిన ప్రళయ్, బ్రహ్మోస్ ఇలా ఎన్నో మిస్సైళ్లు ఇక్కడే తయారయ్యాయి. శాటిలైట్లను సైతం ధ్వంసం చేయగలిగే క్షిపణి హైదరాబాద్‌లోనే తయారైంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఆ జాబితాలో మన దేశం ఉంది” అని అన్నారు.
10TV బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ pdf ఓపెన్ చేయండి..
