Cybercrime : కాలభైరవ పూజ చేయిస్తా..మెడికల్ ఎగ్జామ్ పాస్ చేయిస్తా.. అంటూ విద్యార్ధిని దోచేసిన కేటుగాడు
కాలభైరవుడి పూజ చేస్తే మెడికల్ ఎగ్జామ్ పాస్ అయిపోతావు అంటూ ఓ యువతిని మోసగాడు అడ్డంగా దోచేశాడు. ఆ మాటలు నమ్మిన సదరు యువతి బాబాను నమ్మి..

Mbbs Student Fraud By Fake Baba
కష్టపడకుండా పరీక్ష పాస్ అయిపోవాలనే ఆలోచనతో ఓ విద్యార్ధిని ఓ మోసగాడి వలలో పడింది. ఆ మోసగాడు అడిగిన భారీ మొత్తం ఇచ్చి దగాపడిపోయింది.ఆనక లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించిన వైనం హైదరాబాద్ లో జరిగింది. బాబాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తూ..మాయమాటలుచెప్పి డబ్బులే కాదు జీవితాలనే దోచేస్తున్నా జనాలు ఇంకా మోసపోతునే ఉన్నారు. చదువుకున్నవారు కూడా బాబాల మాయలో పడిపోవటం గమనించాల్సిన విషయం.అదే జరిగింది ఓ విద్యార్థిని విషయంలో.
నేను బాబాని..నేను చెప్పిన పూజ చేస్తే నువ్వు మెడికల్ ఎగ్జామ్ పాస్ అయిపోతావు అని చెప్పటంతో హైదరాబాద్ లోని ఓ విద్యార్థిని మోసగాడి చేతిలో అడ్డంగా బుక్ అయిపోయింది. ఆ బాబా పేరు ‘విశ్వజిత్ జా’. ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. అలా చాటింగ్ తో ఇద్దరు మాట్లాడుకునేవారు. ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఈ సందర్భంగా నువ్వే చేస్తావని అతను అడుగగా..నేను ‘ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ రాటానికి ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది.
దీంతో విశ్వజిత్ జా నువ్వు మెడికల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వటానికి కాలభైరవ పూజతో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌ను పాస్ చేయిస్తానని ఆ యువతికి చెప్పడంతో ఆమె నమ్మింది. ఆ పూజ్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయని అవి నువ్వు ఇస్తే ..పూజ చేయిస్తానని..నువ్వు ఎగ్జామ్ పాస్ చేయిస్తానని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన సదరు యువతి. అతను చెప్పిన బ్యాంక్ ఎకౌంట్ లో డబ్బులు వేసింది.
అలా విడతల వారీగా రూ. 80 వేల నగదును విశ్వజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇంకేమీ చేయలేక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదువుకున్న యువతి కూడా ఇలా సైబర్ క్రైమ్ కు గురి అయ్యింది. అందులోను మెడికల్ స్టూడెంట్ పూజల్ని నమ్మటం..పూజలు చేస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతానని నమ్మి డబ్బులు పోగొట్టుకుని ఆనక మోసపోయానని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసపోతున్నా మోసగాళ్లు మాత్రం కొత్త కొత్త ఆలోచనలతో మోసాలు చేస్తునే ఉన్నారు.