Rain forecast : నేడు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rain forecast : నేడు తెలంగాణలో భారీ వర్షాలు

Rain

Updated On : July 31, 2022 / 1:24 PM IST

Rain forecast : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపర్లుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Hyderabad Rainfall : హైదరాబాద్‌ను మళ్లీ కుమ్మేసిన వాన.. మౌలాలీలో అత్యధిక వర్షపాతం నమోదు

హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని… రేపు కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.