Hyderabad : ఘరానా మోసం.. ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌తో డబ్బు దోచేస్తున్న కేటుగాళ్లు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ సేకరించి..

సేల్ డీడ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకుని సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి నిందితులు ఆన్ లైన్ ద్వారా అమౌంట్ ను విత్ డ్రా చేస్తున్నారు. Hyderabad - Fake Fingerprint

Hyderabad : ఘరానా మోసం.. ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌తో డబ్బు దోచేస్తున్న కేటుగాళ్లు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ సేకరించి..

Hyderabad - Fake Fingerprint

Hyderabad – Fake Fingerprint : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అభివృద్ధి కార్యకలాపాల కోసం వినియోగించాల్సిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. అదే టెక్నాలజీతో చీటింగ్ కు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయం చేస్తున్నారు. తాజాగా ఘరానా మోసం వెలుగుచూసింది. అదే ఫేక్ ఫింగర్ ప్రింట్స్ చీటింగ్. అవును, ఫేక్ ఫింగర్ ప్రింట్స్ సాయంతో జనాల డబ్బును దోచేస్తున్నారు కేటుగాళ్లు.

హైదరాబాద్ లో ఫేక్ పింగర్ ప్రింట్స్ తో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి ఆన్ లైన్ లో అమౌంట్ విత్ డ్రా చేస్తున్నారు కేటుగాళ్లు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సేల్ డీడ్ ల ద్వారా ఫింగర్ ప్రింట్స్ దోచేస్తున్నారు నిందితులు.

ఫింగర్ ప్రింట్స్ తో పాటు ఆధార్ నెంబర్ ను కూడా కాజేస్తున్నారు. సేల్ డీడ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకుని సిలికాన్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి నిందితులు ఆన్ లైన్ ద్వారా అమౌంట్ ను విత్ డ్రా చేస్తున్నారు. ఇక, ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని భారీ స్కెచ్ వేశారు నిందితులు.

Also Read..Viral Video : వామ్మో.. మద్యం మత్తులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన మహిళ, పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడి

బీహార్ కి చెందిన రంజిత్, బెంగళూరుకి చెందిన ఆలం అనే ఇద్దరు కేటుగాళ్లను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ ప్రధానంగా ఫింగర్ ప్రింట్స్ తో మోసాలకు పాల్పడుతున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.24వేలు కొట్టేసిన కేసు విచారణలో భాగంగా ఆధారాలు సేకరించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరూ ప్రధానంగా రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్స్ తీసుకుని సిలికాన్ ప్రింట్స్ తో మోసాలకు పాల్పడుతున్నారు. ఆధార్ కార్డులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కోడ్ తీసుకుని చీటింగ్ చేస్తున్నారు.

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో వీరికి ఎవరెవరు సహకరించారు? వారికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టే పనిలో పడ్డారు పోలీసులు. సేల్ డీడ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటకు వెళ్లాయంటే అక్కడ పని చేసే ఎంప్లాయస్ పాత్ర కచ్చితంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కమిషన్ తీసుకుని సేల్ డీడ్ పత్రాలను అమ్ముకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. తెలంగాణ సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఒక స్పెషల్ టీమ్ ఈ కేసుని విచారిస్తోంది. నిందితులకు సహకరించిన ప్రభుత్వ అధికారులను వదిలేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

Also Read..Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌తో ప్రియురాలి హత్య, ఆ అనుమానంతో అమానుషం