New Year Celebrations : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..!
New Year Celebrations : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Hyderabad Police issued Some Restrictions
New Year Celebrations : 2024 ఏడాది మరికొద్దివారాల్లో ముగియనుంది. 2024కి వీడ్కోలు పలికి 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకబోతున్నాం. న్యూ ఇయర్కోసం ఇప్పటికే చాలామంది కొత్త సంవత్సర వేడుకల కోసం ప్లానింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు.
అంతేకాదు.. కొత్త ఏడాది వేడుకల్లో అశ్లీల నృత్యాలపై కూడా నిషేధం విధించారు. ఔట్‌డోర్‌లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు కూడా బ్యాన్ చేశారు పోలీసులు. అంతేకాదు.. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి లేదన్నారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల సమయంలో తాగి వాహనం నడిపితే రూ. 10 వేలు జరిమానాతో పాటు 6 నెలలు జైలు విధిస్తారు. అలాగే, మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
నగరంలో రాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈవెంట్లు నిర్వాహకులు కొత్త ఏడాదికి 15 రోజులు ముందుగానే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 10 గంటల్లోగా డీజే ఆపేయాలని సూచించారు. డీజే శబ్దం 45 డెసిబెల్స్‌కు మించకూడదని, పబ్బులు, బార్లల్లో కపుల్స్ ఈవెంట్లు, మైనర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.
Read Also : Gossip Garage : గోరటి వెంకన్నకు నజరానా వెనక సీఎం రేవంత్ ప్లాన్ అదేనా?