Police Warning : బయటకొస్తే కోర్టుకే.. వాహనదారులకు పోలీసుల వార్నింగ్

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను హైదరాబాద్ పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బేఖాతరు చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. తాజాగా వాహనదారులకు మరో వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి బండితో బయటకు వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. బండి సీజ్ అవుతుందని, కోర్టుల మెట్లు ఎక్కాల్సి వస్తుందని, జరిమానాలు కట్టాల్సి వస్తుందని చెప్పారు.

Police Warning : బయటకొస్తే కోర్టుకే.. వాహనదారులకు పోలీసుల వార్నింగ్

Police Warning

Updated On : May 26, 2021 / 9:29 AM IST

Police Warning : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను హైదరాబాద్ పోలీసులు మరింత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. బేఖాతరు చేస్తే అస్సలు ఊరుకోవడం లేదు. తాజాగా వాహనదారులకు మరో వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించి బండితో బయటకు వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. బండి సీజ్ అవుతుందని, కోర్టుల మెట్లు ఎక్కాల్సి వస్తుందని, జరిమానాలు కట్టాల్సి వస్తుందని చెప్పారు.

లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా వాహనాలతో రోడ్లపై తిరిగితే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఈ-పాస్‌ లేకుండా తిరుగుతున్న వాహనాల్ని పోలీసులు ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలా జప్తు చేసిన వాహనాల్ని లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు తమ అధీనంలోనే ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయా వాహనాలు రోజుల తరబడి వినియోగించక దెబ్బతినే అవకాశాలున్నాయి.

లాక్‌డౌన్‌ అనంతరం ఉల్లంఘనులపై కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆ వాహనంపై గత లాక్‌డౌన్‌లోనూ ఉల్లంఘనలుంటే.. ‘రిపీటెడ్‌ అఫెండర్లు’గా పరిగణించి అదనంగా కేసులు నమోదు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలో బండి జప్తు అయిన వాహనదారులు కోర్టుల మెట్లాక్కిల్సి ఉంటుంది. అక్కడ న్యాయమూర్తి విధించే జరిమానా చెల్లించి ఆ రసీదుని పోలీస్‌ స్టేషన్‌లో చూపించాలి. ఆయా వాహనాలపై గతంలో జారీ అయిన ఈ-చలానాల బకాయిలుంటే వాటినీ చెల్లించాకే పోలీసులు వాహనాన్ని వదిలిపెడతారు.

ఈ కష్టాలు, బాధలు ఎందుకు అనుకుంటే, లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు చెబుతున్నారు. అకారణంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దని అంటున్నారు. అత్యవసరం ఉన్న వారికి, ఈ పాస్ ఉన్న వారికి మాత్రమే తాము అనుమతి ఇస్తామని తేల్చి చెప్పారు.

తెలంగాణలో 20 గంటల లాక్ డౌన్ అమల్లో ఉంది. ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు ప్రజలకు వెసులుబాటు కల్పించేలా సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత అంతా లాక్ డౌన్. ఎవరూ బయటక కనిపించకూడదు, రాకూడదు.