Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాలవైపు వెళ్లకండి.. ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad : హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్. ఆదివారం (అక్టోబర్ 12వ తేదీ) నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.

Hyderabad
Hyderabad : హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్. ఆదివారం (అక్టోబర్ 12వ తేదీ) నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా గచ్చిబౌలి స్టేడియం నుంచి ఉదయం5.30 నుంచి 8.30 గంటల వరకు గ్రేస్ క్యాన్సర్ రన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వరకు 10 కిలోమీట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
విప్రో సర్కిల్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ ను నానక్‌రామ్‌గూడ – ఓఆర్ఆర్ మార్గంలో మళ్లింపు చేస్తారు.
మెహదీపట్నం నుంచి లింగంపల్లి, హెచ్‌సీయూ, మజీద్ బండ్ వైపు వెళ్లే వాహనాలకు క్యారేజ్‌వేలో రెండు వైపులా అనుమతి ఉంటుంది.
అదేవిధంగా ఉదయం 5:00 నుంచి 8:30 వరకు ట్రక్కులు, లారీలు, గూడ్స్ క్యారియర్లు వంటి భారీ వాహనాలకు గచ్చిబౌలి ట్రాఫిక్ సీఎస్ పరిధిలోని రూట్లలోకి అనుమతించరు.