Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడి పరిస్థితి విషమం..!

శ్రీ తేజకు సంబంధించి ఇప్పటివరకు ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్స్ ప్రకటించలేదు.

Sandhya Theatre Incident : సంధ్య థియేటర్ ఘటన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడి పరిస్థితి విషమం..!

Sri Teja Health Condition (Photo Credit : Google)

Updated On : December 14, 2024 / 10:56 PM IST

Sandhya Theatre Incident : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఆసుపత్రి పాలైన శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ తేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. శ్రీ తేజ అల్లు అర్జున్ కు అభిమాని. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆ రేవతి కొడుకే ఈ శ్రీ తేజ. ఆ రోజున జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అప్పటి నుంచి బాబుకి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కాగా, శ్రీ తేజకు సంబంధించి ఇప్పటివరకు ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్స్ ప్రకటించలేదు.

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి?

ఈ నెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో ను హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ షో ను చూసేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చారు. ఈ విషయం తెలిసి అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పోటీలు పడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. సినిమా చూసేందుకు తన కుటుంబంతో కలిసి వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఆ రోజు నుంచి శ్రీ తేజకు చికిత్స కొనసాగుతోంది. అయితే, శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం, అంతలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం.. ఇలా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.