President Droupadi Murmu : హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన .. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటించనున్నారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

President Droupadi Murmu : హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన .. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

President Droupadi Murmu

Updated On : June 16, 2023 / 1:28 PM IST

Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటించనున్నారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. శుక్రవారం (జూన్16,2023) సాయంత్రం 6 గంటలకు ద్రౌపది ముర్ము బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంరతం రాజ్ భవన్ లో బస చేయనున్నారు. రేపు ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 11:15 ఎయిర్ ఫోర్స్ పరేడ్ లో పాల్గొనున్నారు.అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో నగరంలో నేడు, రేపు (శుక్ర, శనివారాల్లో )పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. దీంట్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. టీఓ జంక్షన్, పీఎన్బీ ఫ్లైఓవర్, జంక్షన్, హెచ్పీఎస్ స్కూల్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప జంక్షన్,యశోద హాస్పిటల్ రోడ్, ఎంఎం. టీఎస్, వివి స్టాట్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి వయా బేగంపేట మీదుగా అమీర్‌పేట్, మెహదీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈ రూట్‌లో రాకుండా అప్పర్ ట్యాంక్బండ్‌పై దారి మళ్లింపు ఉంటుంది.

భవన్ రోడ్, మొనప్ప జంక్షన్, వీవీ స్టాచ్యూ భైరతాబాద్ ఈ మార్గాల్లో రెండు వైపులా రోడ్ మూసివేయపడుతుంది. పంజాగుట్ట రాజభవన్ క్వార్టర్స్ రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డులో వచ్చే వాహనాలను రసూల్ పురా జంక్షన్ వద్ద కొంత సమయం పాటు నిలిపివేస్తారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా వచ్చే వాహనాలను ప్రకాష్ నగర్ టీ జంక్షన్ వద్ద కొంత సమయం నిలుపుదల. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు ఆయా సమయాల్లో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసుల సూచిస్తున్నారు.