Guvvala Amala : నా భర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా : గువ్వల బాలరాజు సతీమణి

బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

Guvvala Amala : నా భర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా : గువ్వల బాలరాజు సతీమణి

Guvvala Balaraju wife Amala

Guvvala Amala Condemn Attack : అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమల స్పందించారు. తన భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ప్రచారాలు చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడులకు తెగబడుతున్నాడని ఆరోపించారు.

ప్రచారాన్ని ముగించుకొని వెళ్తున్న సమయంలో తమ వాహనాలను అడ్డగించి కార్ల అద్దాలను ధ్వంసం చేసి, రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. తన భర్త దవడ భాగంలో, మెడ భాగంలో గాయాలయ్యాయని తెలిపారు. వైద్యులు ఇప్పటికే స్కానింగ్ చేశారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. గతంలో వంశీకృష్ణ అనుచరులు తనపై అసభ్యకరంగా మాట్లాడారని ఆదేదన వ్యక్తం చేశారు.

Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి

పోలీసులకు ఫిర్యాదులు చేసినా వంశీకృష్ణ అనుచరులు తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఎక్కడ తాము గెలుస్తామోనని ఈ విధంగా తమపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. నీచమైన రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ సహా ఆయన అనుచరులకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Palvai Sravanthi : బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి.. రేవంత్, రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, అతని వర్గీయులు దాడి చేసినట్లు తెలుస్తోంది. బాలరాజు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గువ్వల బాలరాజకు గాయాలు అయ్యాయి. గువ్వల బాలరాజును చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు, అనుచరులు గువ్వల బాలరాజును అపోలో ఆస్పత్రికి తరలించారు. గువ్వల బాలరాజు దవడ భాగంలో గాయం అవ్వడంతో ఆయనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గువ్వల బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. గువ్వల బాలరాజు అనుచరులు అపోలో ఆస్పత్రి వద్దనే ఉన్నారు.

Vijayasai Reddy : ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు.. పురంధేశ్వరిపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ఫైర్

ఎన్నికల వేళ అచ్చంపేట నియోజకవర్గంలో ఎన్నిక ప్రచారం ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాత్రి సమయంలో ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ అక్కడ డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం బాలరాజును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు, అనుచరులు బాలరాజును హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అపోలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.