RS Praveen Kumar : సిర్పూర్ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

పోడు భూములకు పట్టాలు పారదర్శకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న నాలుగు లక్షల గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని తెలిపారు.

RS Praveen Kumar : సిర్పూర్ నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా : ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar

Updated On : July 8, 2023 / 8:59 PM IST

RS Praveen Kumar Contest Sirpur : సిర్పూర్ నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిర్పూర్ నుండి పోటీ చేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ విముక్తి కల్పిస్తానని చెప్పారు. ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోయినా.. సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం ఇంకా ఆంధ్ర పాలకులు రాజ్యం ఏలుతున్నారని విమర్శించారు. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ లో “గడపగడపకు బీఎస్పీ” కార్యక్రమంలో ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.

సిర్పూర్ ప్రాంతాన్ని దోచుకోవడం కోసం స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ఇక్కడ స్థిరపడ్డారని పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద బ్రిడ్జీ కూలిపోయిన వ్యవహారంలో ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యతని ఆరోపించారు. సిర్పూర్ పేపర్ మిల్లులో ఇతర ప్రాంతం వారిని తీసుకొచ్చి స్థానిక కార్మికులకు అన్యాయం చేశారని తెలిపారు. దళిత బంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని వెల్లడించారు.

KA Paul : కేసీఆర్ బీజేపీతో గల్లిలో కొట్లాట.. ఢిల్లీలో దోస్తీ : కేఏ పాల్

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సిర్పూర్ లో గౌతమ బుద్ధుడు విగ్రహం, హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టారని పేర్కొన్నారు. పోడు భూములకు పట్టాలు పారదర్శకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న నాలుగు లక్షల గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ మత విద్వేశాలను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు.

దేశంలో, రాష్ట్రంలో బీజేపీని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోశాకా.. సీఎం అతని కాళ్ళు కడగడం విడ్డురంగాఉందన్నారు. మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేసీఆర్ మాయమాటలు చెప్తున్నారని పేర్కొన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు. సిర్పూర్ లో బీఎస్పీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.