Komatireddy Venkat Reddy : కేసీఆర్‌కి దమ్ముంటే.. బండబూతులు తిట్టిన ఆ ఇద్దరిపై వేటు వేయాలి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
తెలంగాణ అంటే ఫుట్ బాల్ ఆడతా అన్నాడు. తెలంగాణ అంటే కర్ర పట్టుకుని కొట్టాడు. Komatireddy Venkat Reddy - CM KCR
Komatireddy Venkat Reddy - CM KCR (Photo : Google)
Komatireddy Venkat Reddy – CM KCR : తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార, విపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కి సవాల్ విసిరారు. కేసీఆర్ కి దమ్ముంటే.. ఆయనను బండబూతులు తిట్టిన దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు. పిల్లల మరణాలకు చలించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. అసలుసిసలైన బానిసత్వం బీఆర్ఎస్ లోనే ఉందే తప్ప కాంగ్రెస్ లో లేదని తేల్చి చెప్పారు.
Also Read..KTR: అందుకే తెలంగాణ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? కేటీఆర్ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?
తన చెల్లిని అరెస్ట్ చేయవద్దని మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మొర పెట్టుకుని వచ్చారని కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
”తెలంగాణ అంటే ఫుట్ బాల్ ఆడతా బొక్కోడా అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ని డిస్మిస్ చేయాలి. మల్లారెడ్డి, మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. వీళ్లందరినీ ఫస్ట్ సస్పెండ్ చేయాలి. తెలంగాణ దొంగ, తెలంగాణ అంటే కర్ర పట్టుకుని కొట్టిన దానం నాగేందర్ ని నీ పార్టీలో ఎమ్మెల్యే చేశావ్. సిగ్గు లేదు” అని విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read..BRS Party: బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఆ మూడు స్థానాలు!
