Ponguleti Srinivasa Reddy : అధికారంలోకి రాగానే.. ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలిస్తాం- పొంగులేటి శ్రీనివాస రెడ్డి
దోచుకున్న లక్ష కోట్ల డబ్బుతో మళ్లీ గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. డబ్బులు తీసుకోండి.. ఎందుకంటే అది మీ సొమ్ము. కానీ, హస్తం గుర్తుపై.. Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy Election Campaign (Facebook)
Ponguleti Srinivasa Reddy Election Campaign : ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ పై ఆయన నిప్పులు చెరిగారు. దొంగ కాదు దొంగన్నర. మోచేతికి బెల్లం రాసి నాకమంటుండు అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 55 లక్షల కోట్ల అప్పుల చేసి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంతో అవినీతి జరిగినా బీజేపీ ఎందుకు నోరు మెడపటం లేదని నిలదీశారు.
Also Read : నా ప్రాణం పోయినా ఆ పని చేయను, ఎన్నికల్లో గెలవాల్సింది మీరే- సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రజల గుండెల్లో ఉన్న శీనన్నగా మీ ముందుకొచ్చాను. ఎంతోమంది యువకుల బలిదానం ఫలితం తెలంగాణ రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణను సోనియమ్మ మనకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం. రైతులకు 2లక్షల రుణమాఫీ ఇస్తాం. ఆడబిడ్డ ఖర్చులకు 2500 ప్రతి నెల మన కాంగ్రెస్ ఇస్తుంది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ 5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతాం.
4వేలు ఆసరా అందిస్తాం. తెలంగాణ అంతటా ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది.
కల్వకుంట్ల కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలొస్తే, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలెక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తాం. డబ్బులకు కక్కుర్తి పడి పేపర్లు లీక్ చేసి విద్యార్థులను రోడ్డున పడేశారు. దోచుకున్న లక్ష కోట్ల డబ్బుతో మళ్లీ గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే కూడా డబ్బు సంచులతో వస్తున్నారు. డబ్బులు తీసుకోండి.. ఎందుకంటే అది మీ సొమ్ము. కానీ, హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి. కీ.శే తమ్మినేని కృష్ణయ్య ఆశయాలను నెరవేరుద్దాం. దళితబంధు ఎంతమందికి ఇచ్చారు? ఎమ్మెల్యేకు చేయాల్సిన అభివృద్ధి పనులు కనపడవు. డబ్బు వెదజల్లి రాజకీయం చేయాలనుకుంటున్నారు. మీ అందరి ఆశీస్సులతో పాలేరు ఎమ్మెల్యేగా గెలుస్తా” అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Also Read : బీఆర్ఎస్‌లో చేరనున్న టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. గోశామహల్ నుంచి పోటీ?